చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి..? వాటిని ఎలా తగ్గించుకోవాలి?

First Published Jan 10, 2023, 12:01 PM IST

ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలోనే కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఉన్న నొప్పులు కూడా ఎక్కువవుతాయి. అసలు చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకొస్తాయో తెలుసా? 
 

చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలతో పాటుగా కీళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి. కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు సాధారణంగా వృద్ధులు లేదా అథ్లెట్లు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ.. కొంతమందికి చలికాలంలో మాత్రమే కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పి ఎక్కువగా వాతావరణంలోని మార్పు వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

శీతాకాలంలో కీళ్ల నొప్పులకు కారణాలు

తక్కువ ఉష్ణోగ్రత కండరాల నొప్పులకు దారితీస్తుంది. ఫలితంగా కండరాల దృఢత్వం, కీళ్ల నొప్పులు వస్తాయి. దీనికి తోడు ఈ సీజన్ లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మీ ఎముకలు, కీళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది.

బయట చల్లగా ఉన్నప్పుడు కూడా కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. ఎలా అంటే కాలి, వేళ్లు వంటి మన అంత్య భాగాలకు రక్తం సరిగ్గా అందదు. ఈ కీళ్ల నొప్పులు మరీ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. మీకు మీరు ఈ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా దీనివల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మీ శరీర భాగాలను బాగా కదిలిస్తుంది కూడా. ఇది చలిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే నొప్పిని దూరం చేయడానికి బాగా సహాయపడుతుంది. వ్యాయామం చేయడానికి ముందు వార్మప్ తప్పకుండా చేయండి. అయితే నొప్పి మరీ ఎక్కువుంటే హెవీ వ్యాయామాలను చేయకండి. 

Image: Getty Images

మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోండి

సాధ్యమైనప్పుడల్లా మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా, వెచ్చగా ఉంచుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే.. ఇంటి లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి హీటర్లను ఉపయోగించండి. ఒకవేళ మీరు బయటకు వెళితే.. టోపీలు, చేతులకు గ్లౌజులు, స్కార్ఫ్ వంటి వెచ్చని దుస్తుల దుస్తలను కప్పుకోండి. 

ఒమేగా -3 అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారం ఉమ్మడి మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ కొవ్వు ఆమ్లాలు మీ నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అందుకే శీతాకాలంలో కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాల్మన్, వాల్ నట్స్, అవిసె గింజలు, అవోకాడో వంటి ఆహారాలను ఎక్కువగా తినండి. 
 

హైడ్రేటెడ్ గా ఉండండి

చలికాలంలో చాలా మంది నీళ్లను అస్సలు తాగరు. ఎందుకంటే వీళ్లకు ఎండాకాలంలో కంటే తక్కువ దాహంగా అనిపిస్తుంది. అయినప్పటికీ.. ఈ సీజన్ లో నీళ్లను తగినంత తాగకపోవడం నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఇది నొప్పి, అలసటను పెంచుతుంది. అందుకే చల్లని నీటిని తాగాలనిపించకపోతే గోరువెచ్చని నీటిని తాగండి. దీనివల్ల మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా నీటిని కూడా పుష్కలంగా తాగండి. వ్యాయామం చేస్తే మీరు  ఆటోమెటిక్ గా నీటిని ఎక్కువగా తాగుతారు. 

click me!