Health Risks of Almonds: బాదం పప్పులను వీరు తినకపోవడమే ఉత్తమం

Published : Nov 30, 2025, 11:24 AM IST

Health Risks of Almonds: నానబెట్టిన బాదం పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది.  వీటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు. ఎవరు బాదంపప్పులు తినకూడదో తెలుసుకోండి.

PREV
16
బాదం పప్పు ఎవరు తినకూడదు?

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బాదం పప్పులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ప్రతి రోజూ నాలుగు నుంచి అయిదు బాదం పప్పులు తింటే ఎంతో మంచిది.  అందుకే వైద్యులు బాదం తినమని చెబుతూ ఉంటారు.  బాదం పప్పులు నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి. కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు బాదం తినకూడదు. ఎలాంటి వారు బాదం పప్పులను తినడకూడదో తెలుసుకోండి.

26
అలెర్జీ ఉన్నారు

నట్స్ అలెర్జీ ఉన్నవాళ్లు కొంతమంది ఉంటారు. అలాంటి వారు బాదం పప్పును తినకూడదు. ఒకవేళ ఈ నట్స్ ను  తెలియక తినేస్తే.. వెంటనే చర్మంపై దురద, మంట, వాపు, చర్మం ఎర్రబడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బాదం తిన్న వెంటనే పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

36
కిడ్నీలో రాళ్లు సమస్య

కిడ్నీలో రాళ్ల సమస్య ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య.  కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రోజూ బాదం పప్పులను తినకూడదు. ఎందుకంటే బాదంలో ఆక్సలేట్లు  ఉంటాయి. ఇవి కిడ్నీలోని కాల్షియంతో కలిసి స్పటికాలు ఏర్పడేలా చేస్తాయి.

46
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే

కొందరికి జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా  ఉంటే బాదం పప్పులు తినకూడదు. బాదంలో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. వీరు బాదం పప్పులను అధికంగా తింటే అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధకం, పేగు అలర్జీ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీరు బాదం పప్పులను తినకపోవడమే మంచిది.

56
అధిక రక్తపోటు ఉంటే..

హైబీపీ సమస్య ఉన్నవాళ్లు బాదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వీటిని తినడం మానేస్తే మంచిది. బాదంలో ఉంటే పొటాషియం.. రక్తపోటు కోసం వేసే మందులతో చర్య జరుపుతుంది. దీని సమస్య ముదిరిపోతుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా  మీరు బాదం పప్పులు తినకూడదు.

66
బరువు పెంచేస్తుంది

బరువు తగ్గే ప్రయాణంలో ఉన్నవారు కూడా బాదం తక్కువగా తినాలి. బాదంలో ప్రొటీన్ ఉంటుంది. అయినా కూడా వీళ్లు రోజూ బాదం తినకూడదు. ఎందుకంటే బాదంలో కేలరీలు చాలా ఎక్కువ. కేలరీలు పెరిగితే బరువు కూడా త్వరగా పెరిగిపోతారు.

Read more Photos on
click me!

Recommended Stories