Tamarind: చింతపండు రంగు, రుచి మారకుండా సంవత్సరం మొత్తం తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు

Published : Sep 18, 2026, 10:13 AM IST

Tamarind: చింతపండు సరిగా నిల్వ చేయకపోతే.. దానికి పురుగులు పట్టడమే కాదు, రంగు మారిపోతుంది. రుచి కూడా దెబ్బ తింటుంది. అలా అవ్వకుండా సంవత్సరం మొత్తం తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.

PREV
13
చింత పండు ఎలా స్టోర్ చేయాలి?

వర్షాకాలం మొదలవ్వగానే గాలిలో తేమ పెరుగుతుంది. దీని కారణంగా.. కిచెన్ లో చాలా రకాల మసాలా దినుసులు, పప్పులు, పిండి లాంటివి తొందరగా పాడైపోతూ ఉంటాయి. మనం రెగ్యులర్ గా చేసే చాలా రకాల వంటల్లో చింత పండు చాలా కీలకం. కానీ, వర్షాకాలంలో సరిగ్గా నిల్వ చేయకపోతే తేమ వల్ల చింత పండు జిగటగా మారుతుంది. రుచి తగ్గిపోతుంది. పురుగులు కూడా పట్టే అవకాశం ఉంది. మరి, ఎలా నిల్వ చేస్తే... చింత పండు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం....

23
చింతపండు నిల్వ చేయడానికి 5 సులువైన చిట్కాలు:

1. ఎయిర్ టైట్ కంటైనర్లు వాడండి:

తేమ లోపలికి వెళ్లకుండా ఉండటానికి చింతపండును ఎల్లప్పుడూ ఎయిర్ టైట్ కంటైనర్లలోనే ఉంచాలి. ఇది బూజు పట్టకుండా, జిగటగా మారకుండా కాపాడుతుంది. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

2.గాజు పాత్రలు వాడాలి..

ఎక్కువ రోజులు చింత పండు తాజాగా ఉండాలి అంటే.. మీరు పొరపాటున కూడా దీనిని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయకూడదు. అలా అని స్టీల్ పాత్రలు కూడా వాడకూడదు. గాజు సీసాలో ఉంచడం వల్ల దాని సహజమైన పులుపు, రుచి మారకుండా ఉంటాయి.

3. ఫ్రిజ్‌లో నిల్వ చేయడం:

ఎక్కువ మొత్తంలో చింతపండు ఉన్నప్పుడు, దాన్ని ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో సీల్ చేసి ఫ్రిజ్‌లోని వెజిటబుల్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచండి. దీనివల్ల రుచి దెబ్బతినకుండా చాలా కాలం తాజాగా ఉంటుంది.

4. తేమ తగలకుండా జాగ్రత్త పడండి:

చింతపండును చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. చింతపండును తీసేటప్పుడు తడి చేతులు లేదా తడి స్పూన్లు అస్సలు ఉపయోగించవద్దు. తడి తగిలితే బూజు పడుతుంది.

5. చింతపండు గుజ్జు చేసి పెట్టుకోవడం:

చింతపండు గింజలు తీసేసి, గోరువెచ్చని నీటిలో నానబెట్టి గుజ్జు తీయండి. ఈ పేస్ట్‌ను ఫ్రిజ్‌లో గాజు సీసాలో నిల్వ చేసుకుంటే వంటల్లోకి వెంటనే వాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.

ఉప్పు కలపడం: మన ఇంట్లో పెద్దలు పాటించే పాత చిట్కా ఇది. చింతపండును నిల్వ చేసే ముందు దానికి కొద్దిగా ఉప్పు కలపడం వల్ల అది సహజమైన ప్రిజర్వేటివ్‌గా పనిచేసి తేమను, బూజును రానివ్వదు.

33
చింతపండు పాడైపోయిందని ఎలా గుర్తించాలి?

చింతపండు నుండి దుర్వాసన రావడం, విపరీతమైన జిగటగా మారడం, లేదా రంగు ముదురు గోధుమ నుండి గ్రే/నలుపు రంగులోకి మారితే అది పాడైపోయిందని అర్థం. బూజు పట్టిన చింతపండును ఉపయోగిస్తే కడుపు రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.

గింజలతో నిల్వ చేయవచ్చా? గింజలతో నిల్వ చేయవచ్చు, కానీ నిల్వ చేసే ముందే గింజలు, ఈనెలు తొలగిస్తే పురుగులు పట్టే అవకాశం తగ్గి, వాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది.

ఫ్రీజర్‌లో పెట్టవచ్చా?

చింతపండు గుజ్జును చిన్న భాగలుగా చేసి జిప్‌లాక్ బ్యాగ్‌లో ఫ్రీజర్‌లో పెడితే 6 నెలల వరకు రుచి మారకుండా ఉంటుంది. కావలసినప్పుడు మాత్రమే కొంత తీసి వాడుకోవచ్చు.ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా చింతపండు పాడవకుండా, ఫ్రెష్‌గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories