చికెన్ తో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో చికెన్ కూర వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే చికెన్‌ను రుచిగా వండటం అందరికీ రాదు. కాస్త అటూ ఇటైనా చికెన్ గట్టిగా, డ్రైగా మారిపోతుంది. లేదా చికెన్ ఇగురు అంత రుచిగా రాదు. చికెన్ ముక్కలు పైన ఉడికినట్లు కనిపించినా లోపల మాత్రం సరిగ్గా ఉడకదు. కొన్ని తప్పులు వల్ల చికెన్ కూర సరిగా రాదు. చికెన్ కూర రుచిగా రావాలంటే చికెన్ కూర ఎలా వండకూడదు, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.
ఫ్రోజెన్ చికెన్ వాడుతారు కొంతమంది. కానీ దాన్ని వాడకూడదు. తాజా చికెన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వండినప్పుడు జ్యూసీగా వస్తుంది. ఫ్రోజెన్ లేదా ప్యాక్ చేసిన చికెన్ తన సహజమైన తేమను కోల్పోయి డ్రైగా మారుతుంది. వీలైనంత వరకు ఫ్రెష్ చికెన్ వాడేందుకు ప్రయత్నించండి.
కేవలం బోన్‌లెస్ ముక్కల కంటే ఎముకలు ఉండే భాగాల్లో కొవ్వు శాతం సరిగ్గా ఉంటుంది. ఇది ఉడికేటప్పుడు కరిగి, మాంసానికి మంచి ఫ్లేవర్, తేమను ఇస్తుంది. కాబట్టి బోన్‌లెస్ చికెన్ వండితే అంత రుచిగా ఉండదు.