Sofa Cleaning: సోఫా పాతగా మార మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది

Published : May 30, 2026, 02:41 PM IST

Sofa Cleaning: ప్రతి ఇంట్లో సోఫా ఉంటుంది. కొన్ని రోజుల వాడాక దానిపై మురికి, జిడ్డు పేరుకుంటుంది. కొన్ని సార్లు మురికి వాసన వస్తుంది. వంట సోడాతో సహజంగా సోఫాను ఎలా శుభ్రం చేయాలో, మొండి మరకలను ఎలా తొలగించాలో తెలుసుకోండి.

PREV
14
సోఫాను ఎలా శుభ్రం చేయాలి?

ఎవరి ఇంట్లో అయినా ఎక్కువగా వాడేది హాల్ లో ఉన్న సోఫానే.  అందుకే అది త్వరగా మురికిగా మారిపోతుంది. ఒక్కోసారి చెడు వాసన వస్తుంది. దాన్ని కుర్చీల్లా, మంచంలా వాడేస్తూ ఉంటాము.  మధ్యాహ్నం నిద్ర వస్తే సోఫాలోనే నిద్రపోయే వారు ఎంతో మంది.  జిడ్డు చేతులతో తాకడం, పెంపుడు జంతువుల వల్ల సోఫాపై మరకలు, వెంట్రుకలు అంటుకుంటాయి. అందుకే సోఫాను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.  సోఫాను ఎంత తరచుగా శుభ్రం చేయాలనేది దానికి వాడిన ఫ్యాబ్రిక్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యాబ్రిక్ సోఫా అయితే ప్రతి వారం క్లీన్ చేయాల్సిందే. రోజూ వాక్యూమ్ చేస్తే పెంపుడు జంతువుల వెంట్రుకలు, దుమ్ము ఫ్యాబ్రిక్‌లోకి చేరకుండా ఉంటాయి. మరకలు పడిన వెంటనే శుభ్రం చేయండి. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి డీప్-క్లీన్ చేయాలి. 

24
సోఫా క్లీనింగ్‌ ఈ పదార్థంతో

మీరు సోఫాకు పట్టిన జిడ్డును వదిలించాలనుకుంటే వంట సోడా (Baking soda) బాగా పనిచేస్తుంది.  దీని కోసం బ్రష్ అటాచ్‌మెంట్ ఉన్న వాక్యూమ్ క్లీనర్, పొడి బ్రష్ లేదా శుభ్రమైన క్లాత్, గోరువెచ్చని నీరు, గిన్నెలు కడిగే సబ్బు (Dish soap), మైక్రోఫైబర్ క్లాత్ వంటివి అవసరం పడతాయి. ఇవన్నీ ఉంటే మీ సోఫా కొత్తదానిలా మెరిసిపోతుంది.

34
బేకింగ్ సోడాతో శుభ్రం చేసే పద్ధతి

మొదట సోఫాపై ఉన్న దుమ్ము, చెత్తను వాక్యూమ్ క్లీనర్‌తో తొలగించాలి. తరువాత పొడి బ్రష్ లేదా క్లాత్ తో సోఫాపై ఉన్న ఎండిన మరకలను మెల్లగా రుద్దాలి. ఫ్యాబ్రిక్‌కు నష్టం జరగకుండా జాగ్రత్తపడండి.  సోఫాపై బేకింగ్ సోడాను సమానంగా చల్లండి. వాసన, తేమను పీల్చుకోవడానికి 15 నుంచి 30 నిమిషాలు అలానే వదిలేయండి. తర్వాత మళ్లీ వాక్యూమ్ క్లీనర్‌తో బేకింగ్ సోడాను పూర్తిగా తొలగించండి.  సోఫా చెక్క హ్యాండిల్స్ లేదా కాళ్లను సబ్బు నీటిలో ముంచిన మైక్రోఫైబర్ క్లాత్ తో తుడిచి, ఆపై పొడి వస్త్రంతో తుడవండి. అవసరమైతే వుడ్ పాలిష్ వాడండి.

44
సోఫా శుభ్రంగా ఉండటానికి చిట్కాలు

సోఫా ఎక్కువ కాలం పాటూ శుభ్రంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతిరోజూ ఇల్లు తుడిచేటప్పుడు సోఫాను కూడా వాక్యూమ్ చేయాలి. కుషన్లను అప్పుడప్పుడు రొటేట్ చేయాలి. దీనివల్ల అవి అన్ని వైపులా సమానంగా వాడకంలోకి వస్తాయి. సోఫాపై కూర్చొని ఆహారం తినడం వంటి పనులు చేయకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories