Lemon: సగం కోసిన నిమ్మకాయ ముక్క వారం రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు

Published : May 30, 2026, 02:23 PM IST

Lemon:  కట్ చేసిన నిమ్మకాయ ఫ్రిజ్ లో పెట్టినా కూడా ఎండిపోతోందా? అయితే.. సింపుల్ చిట్కాలతో కట్ చేసినా కూడా నిమ్మకాయను తాజాగా ఉంచొచ్చు. ఇవి ఫాలో అయితే… వారం రోజులు అయినా తాజాగా ఉంటాయి. 

PREV
15
నిమ్మకాయ....

రెగ్యులర్ గా మనమందరం నిమ్మకాయలను వాడుతూనే ఉంటాయి. ఎండాకాలంలో ఈ నిమ్మకాయల వాడకం మరికాస్త ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది నిమ్మకాయ కట్ చేసి.. సగం వాడి.. మిగిలిన సగం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఫ్రిజ్ లో పెట్టినా కూడా నిమ్మ చెక్క ఎండిపోతుంది. మరి, కట్ చేసిన నిమ్మకాయ చెక్క ఎండిపోకుండా.. తాజాగా ఉండాలంటే ఎలాంటి సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం…

25
అల్లూమినియం ఫాయిల్...

సగం కోసిన నిమ్మకాయను Plastic Wrap  లేదా అల్లూమినియం ఫాయిల్ లో గాాలి తగలకుండా చుట్టాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలోని తేమ ఆవిరైపోకుండా ఉంటుంది.  ఆ తర్వాత దానిని ఫ్రిజ్ లో పెడితే.. వారం రోజులైనా అప్పుడే కోసినట్లుగా తాజాగా ఉంటుంది.

35
నీటి గిన్నెతో....

ఇది చాలా సులభమైన పద్దతి. ఒక చిన్న గిన్నెలో లేదా గాజు పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకోవాలి.  కోసిన నిమ్మకాయ లోపలి భాగం నీటిలో మునిగేలా బోర్లా పెట్టాలి. ఆ తర్వాత గిన్నెను ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వారం నుంచి పది రోజుల వరకు నిమ్మ చెక్క తాజాగా ఉంటుంది. అయితే.. నీటిని మాత్రం ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి.

45
వంట నూనె లేదా వెనిగర్‌తో...
నిమ్మకాయ కోసిన భాగానికి ఒకటి లేదా రెండు చుక్కల వంట నూనె (ఆలివ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్) లేదా వైట్ వెనిగర్ రాయండి. ఇది నిమ్మకాయపై ఒక రక్షణ పొరలా పనిచేసి గాలి తగలకుండా నిరోధిస్తుంది. ఆ తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
55
జిప్ లాక్ బ్యాగ్‌లు వాడండి
మీరు నిమ్మకాయను ముక్కలుగా కోసి నిల్వ చేయాలనుకుంటే, వాటిని ఒక జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి, అందులోని గాలిని పూర్తిగా బయటకు తీసి సీల్ చేయండి. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే వంటగదిలో నిమ్మకాయ వృథా కాకుండా చూసుకోవచ్చు. అవసరమైనప్పుడు తాజాగా వాడుకోవచ్చు.
Read more Photos on
click me!

Recommended Stories