మీ ఇంట్లో పాలు పదేపదే విరిగిపోతున్నాయా? ఇలా జరగడం మంచిదో కాదో తెలుసుకోండి

Published : Aug 27, 2025, 05:44 PM IST

కొందరిలో పాలు పదేపదే విరిగిపోతాయి. అలా విరిగిపోవడం అనేది వాస్తు శాస్త్రంతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. పాలు విరగడం అనేది జీవితంలో ఎలాంటి పరిస్థితులను సూచిస్తుందో తెలుసుకోండి. 

PREV
15
పాలు విరగడం మంచిది కాదా?

పాలు మరిగించేటప్పుడు పొంగిపోవడం సహజం. అలా పొంగడం మంచిదని కూడా అంటారు. అయితే కొన్నిసార్లు అవి విరిగిపోతాయి. ముక్కలుగా మారి పెరుగులాగా తయారవుతాయి. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతారు. అధిక మంట మీద మరిగించడం లేదా పాత్రలు శుభ్రంగా లేకపోవడం కారణంగా చెబుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పాలు పదేపదే విరిగిపోతున్నాయంటే అది సాధారణమైన విషయం కాదు.

25
ప్రతికూల ప్రభావాలు

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం పాలు విరిగిపోవడం అనేది ఇంట్లో ప్రతికూల ప్రభావాలను, దిశ దోషాలను, కుటుంబంలోని విభేదాలను సూచిస్తుంది. ఇది కేవలం చిన్న సమస్య కాదు. అది ఇంటి ఆనందానికి, ఆ కుటుంబ శాంతితో ప్రత్యక్షమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి పదే పదే పాలు విరగడాన్నే మీరు తేలికగా తీసుకోకండి. దీనికి పరిహారాలను వాస్తు శాస్త్రం ద్వారా తెలుసుకోవడం చాలా అవసరం.

పాలను స్వచ్ఛతకు, ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. పదేపదే పాలు పెరుగుతున్నాయంటే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని అర్థం. లేదా ప్రవేశించింది అని అర్థం. కుటుంబంలో విభేదాలు పెరగడం ఇంటి వాతావరణం చికాకుగా మారడం వంటివి జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది.

35
వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది?

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంటి ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈశాన్య దిశను దేవుని ప్రదేశంగా పరిగణిస్తారు. అక్కడ చెత్త, బరువైన వస్తువులు, దూళి వంటివి ఉండకూడదు. అలా ఉన్నా కూడా పాలు పదేపదే విరిగే అవకాశం ఉంది. అలాగే నైరుతి దిశ అనుబంధాలకు సంబంధించినది. ఈ దిశలో లోపం ఉన్న కూడా కుటుంబంలో ఇబ్బందులు పాలు విరిగిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వంటగది ఆగ్నేయ దిశలో కాకుండా వేరే చోట ఉన్నా కూడా పాలు, పెరుగు, నెయ్యి వంటి వస్తువులు త్వరగా చెడిపోవడం వంటివి జరుగుతాయి. ఇక తూర్పు దిశలో కాంతి లేదా గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడినా కూడా ఇలా పాలు విరిగే సమస్య కనిపిస్తుంది.

45
ఈ గ్రహాలతో అనుబంధం

జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం పాలకు చంద్రుడు, శుక్రునితో అనుబంధం ఉంటుంది. పాలు పదేపదే విరుగుతున్నాయంటే చంద్రుడు స్థానం బలహీనంగా ఉందని అర్థం. అలాగే శుక్ర గ్రహం లోపం వల్ల కూడా పాల ఉత్పత్తులు ప్రభావితం అవుతాయి. దీనివల్ల ఆ ఇంట్లో ఉన్నవారికి మానసిక ఒత్తిడి, కుటుంబ వివాదాలు వంటివి తలెత్తే అవకాశం ఉంది.

55
ఈ వాస్తు నివారణలు

ఇంట్లో పాలు పదే పదే విరుగుతున్నప్పుడు కొన్ని ఇంటి నివారణలను పాటించండి. ఇంటి ఈశాన్యం, నైరుతి దిశలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. అక్కడ బరువైన వస్తువులు ఏవీ ఉంచకండి. అలాగే వారానికి ఒకసారి వంటగదిని, ప్రధాన ద్వారాన్ని ఆవుపేడతో రుద్దండి. ఇది ప్రతికూల శక్తిని పోయేలా చేస్తుంది. వంటగది లో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును ఉంచి ప్రతివారం మారుస్తూ ఉండండి. ఇది ఇంట్లోని ప్రతికూలతను గ్రహిస్తుంది. అలాగే పాలు మరిగిస్తున్నప్పుడు ఓం నమశ్శివాయ, ఓం దుగ్ధాయ నమః... మంత్రాలను జపించడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. పాలు మరిగేటప్పుడు ఒక వెండి చెంచాను గిన్నెలో పెట్టడానికి ప్రయత్నించండి. ఇది పాలును విరగకుండా అడ్డుకుంటుంది. ఇంటి ప్రాంగణంలో ఉత్తర దశలో తులసి మొక్కను నాటండి. ఇది సానుకూల శక్తిని పెంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories