రెండు రకాల ధాన్యాలను ఒకేసారి తినడం వల్ల కేలరీల వినియోగం పెరుగుతుంది. కడుపు నిండిన భావన వచ్చినా, ఓవర్ ఈటింగ్ (ఎక్కువగా తినడం) జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి అనుకున్న ఫలితాలు రావు, పైగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
4. జీర్ణక్రియపై ప్రభావం
అన్నం త్వరగా జీర్ణమవుతుంది, కానీ గోధుమలతో చేసే చపాతీ జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటి జీర్ణక్రియ వేగం వేర్వేరుగా ఉండటం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నిపుణులు ఏం చెబుతున్నారు..?
ఏదో ఒకటే ఎంచుకోండి: ఒకే పూటలో అన్నం లేదా చపాతీ... ఏదో ఒక దాన్ని మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.
కూరగాయలు, ప్రోటీన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి: ప్లేట్‌లో సగం భాగం కూరగాయలు (సలాడ్స్), పావు భాగం ప్రోటీన్ (పప్పు, పనీర్, గుడ్లు లేదా చికెన్/ఫిష్), మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీ ఉండేలా చూసుకోవాలి.
తప్పనిసరిగా రెండూ తినాలనుకుంటే: ఒక వేళ రెండూ తినాలనిపిస్తే, ఒక చిన్న చపాతీ, చాలా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకుంటూ, కూరలు ఎక్కువ మోతాదులో తినడం మంచిది.