ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి లడ్డు గురించి మనందరికీ తెలిసిందే. స్వచ్ఛమైన నెయ్యి, శనగపిండి, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారుచేసే ఈ లడ్డుకి భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది. అలాగే తమిళనాడులోని పళని మురుగన్ ఆలయంలో ఇచ్చే పంచామృతం కూడా రుచిగా ఉంటుంది. దీనిలో ఎటువంటి పంచదార వాడకుండా అరటిపండ్లు, బెల్లం, తేనె, ద్రాక్ష, యాలకులతో సహజంగా తయారుచేస్తారు. ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయంలో తయారుచేసే 'మహాప్రసాదం' చాలా ప్రత్యేకమైనది. మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టెల పొయ్యి మీద వండుతారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో అందించే వేడివేడి 'కడా ప్రసాదం' కూడా అద్భుతంగా ఉంటుంది.