IRCTC : స్లీపర్ టికెట్‌తో ఏసీలో ప్రయాణించవచ్చు.. ఈ సీక్రెట్ ట్రిక్ మీకు తెలుసా?

Published : Jun 08, 2026, 05:34 PM IST

స్లీపర్ క్లాస్ టికెట్ కొని ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశం రైల్వే కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ 'ఆటో అప్‌గ్రేడేషన్' ఫీచర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
15
రైల్ స్లీపర్ టికెట్‌లో ఏసీలో ప్రయాణించవచ్చా..?

భారత్‌లో రోజూ లక్షలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశంలో ప్రతిరోజూ 19 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి… అయినా టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయినా కొన్నిసార్లు టికెట్ కన్ఫర్మ్ కాదు. దీన్నిబట్టే రైల్వేలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే రైల్వే ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది… అలాంటి ఓ ట్రిక్ ను ఇక్కడు తెలుసుకుందాం. 

సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా స్లీపర్ క్లాస్ (Sleeper Class) టికెట్లనే ఎంచుకుంటారు. ఇలా కొన్నిసార్లు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసినా, ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశం వస్తుంది. అవును.. మీరు వింటున్నది నిజమే.. మీ దగ్గర స్లీపర్ టికెట్ ఉన్నా, ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయకుండా ఏసీ కోచ్‌లోకి మారేందుకు ఒక మార్గం ఉంది. IRCTC అధికారికంగా అందిస్తున్న ఈ 'ట్రిక్' గురించి వివరంగా చూద్దాం.

25
స్లీపర్ టికెట్ తో ఏసి సీటు పొందండిలా..

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం 'ఆటో అప్‌గ్రేడేషన్' (Auto Upgradation) అనే స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద మీరు స్లీపర్ క్లాస్‌లో టికెట్ బుక్ చేసినా, మీ టికెట్ ఆటోమేటిక్‌గా ఏసీ (3AC, 2AC) కోచ్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. రైల్వే చార్ట్ తయారుచేసేటప్పుడు ఏసీ కోచ్‌లలో సీట్లు ఖాళీగా ఉండి, స్లీపర్ క్లాస్‌లో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ఈ విధానాన్ని ఉపయోగిస్తుంది. దీనివల్ల ఏసీ సీట్లు నిండటంతో పాటు, స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ తగ్గుతుంది.

35
ఈ సౌకర్యం పొందడానికి మీరు ఏం చేయాలి?

ఈ సౌకర్యం మీకు అందాలంటే టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. మీరు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేస్తుంటే 'Review Journey Details' పేజీలో "Consider for Auto Upgradation" అనే చెక్‌బాక్స్‌ను టిక్ చేయాలి. అదే రైల్వే కౌంటర్‌లో ఫామ్ నింపి టికెట్ తీసుకుంటుంటే ఆ ఫామ్‌లో ఆటో అప్‌గ్రేడేషన్ కావాలా అనే ప్రశ్నకు 'Yes' అని రాయాలి. ఈ సదుపాయం కోసం మీరు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

45
ఆటో అప్‌గ్రేడేషన్ షరతులు..

ఈ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ద్వారా (Automated System) కొన్ని నిబంధనల ప్రకారం జరుగుతుంది. సాధారణంగా కన్ఫర్మ్ (Confirmed) టికెట్లు ఉన్న ప్రయాణికులకే ఈ అవకాశం ముందుగా లభిస్తుంది. ఒకే PNR నంబర్‌పై నలుగురు టికెట్లు తీసుకుంటే, సీట్ల లభ్యతను బట్టి నలుగురికీ అప్‌గ్రేడ్ లభిస్తుంది. మీకు ఏసీ కోచ్‌లో సీటు కేటాయించిన తర్వాత, మీ పాత స్లీపర్ సీటు వెయిటింగ్ లిస్ట్‌లోని వేరొక ప్రయాణికుడికి కేటాయిస్తారు. కాబట్టి మీరు మళ్లీ పాత సీటుకు వెళ్లలేరు.

55
మీ టికెట్ అప్‌గ్రేడ్ అయ్యిందా అని ఎలా తెలుసుకోవాలి?

రైలు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు చార్ట్ సిద్ధమైనప్పుడు, మీకు కొత్త సీట్ నంబర్, కోచ్ నంబర్‌తో (ఉదాహరణకు B1, B2) SMS వస్తుంది. లేదంటే మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లే ముందు మీ PNR స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అందులో మీ ప్రస్తుత కోచ్, సీటు వివరాలు మారినట్లు కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories