మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ స్క్రీన్లు తరచూ వేలిముద్రలు, దుమ్ముతో మసకబారిపోతుంటాయి. గ్యాడ్జెట్ క్లీనర్ కిట్‌లో క్లీనింగ్ లిక్విడ్, మైక్రోఫైబర్ క్లాత్, చిన్న బ్రష్ వంటి పరికరాలు ఉంటాయి. వీటి సహాయంతో గ్యాడ్జెట్లను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది స్క్రీన్‌ను గీతలు పడకుండా కాపాడుతూ కొత్తదానిలా మెరిపిస్తుంది.