Curd: కేవలం గంటలో పాలను గడ్డ పెరుగులా మార్చేయచ్చు..ఈ సింపుల్ చిట్కా తెలిస్తే చాలు..!

Published : Oct 12, 2026, 12:52 PM IST

Curd: పాలు పెరుగులా మారాలి అంటే..కనీసం ఐదు, ఆరు గంటలైనా పడుతుంది. రాత్రి పాలు తోడేస్తే.. ఉదయానికి గడ్డలా మారుతుంది. కానీ, కేవలం గంటలోనే పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఒకటి ఉంది.

PREV
13
Curd

భారతీయుల భోజనంలో పెరుగు ఒక భాగం. ఎన్ని రకాల కూరలు ఉన్నా... చివరలో ఒక్క ముద్ద అయినా.. పెరుగుతో తినకపోతే భోజనం చేసినట్లు కూడా అనిపించదు. అందుకే, ప్రతి ఒక్కరూ రోజూ తమ ఇంట్లో పెరుగు తయారు చేసుకుంటారు. ఇంట్లో పెరుగు తోడు పెట్టడం అంటే సాధారణంగా ఐదు నుంచి ఆరు గంటలు లేదా రాత్రంతా పడుతుంది. ముఖ్యంగా, చలికాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు సరిగ్గా తోడుకోదు. అంతేకాదు, నీరులాగా మారిపోతుంది. కానీ, ఒక చిన్న ట్రిక్ సహాయంతో... పాలను ఒకే ఒక్క గంటలో గడ్డ పెరుగులా మార్చొచ్చు. అత్యవసరంగా పెరుగు కావాలి అనుకున్నప్పుడు లేదా, పాలు తోడు వేయడం మర్చిపోయినప్పుడు.. ఈ సింపుల్ టెక్నిక్ వాడితే సరిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

23
గంటలో పాలను పెరుగులా మార్చాలంటే.. కావాల్సిన పదార్థాలు..

పాలు (ఫుల్ క్రీమ్ పాలు అయితే మరింత మంచిది) - 1 లీటర్

తోడు కోసం పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

పెరుగు తయారీ విధానం...

మొదటగా ఒక గిన్నెలో పాలను పోసి బాగా మరిగించాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిసేపు చల్లారబెట్టాలి. పాలు మరీ వేడిగా ఉండకూడదు అలా అని పూర్తిగా చల్లగా కూడా ఉండకూడదు. మనం వేలు పెట్టి చూస్తే ఆ వేడిని సులభంగా భరించేలా, గోరువెచ్చగా ఉండాలి. ఇదే పెరుగు సరిగ్గా తోడుకోవడానికి అత్యంత కీలకమైన దశ. ఇప్పుడు గోరువెచ్చని పాలలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసి విస్కర్ లేదా గరిటె సహాయంతో బాగా గిలకొట్టాలి. తోడు పాలలో సమానంగా కలిసేలా ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి.

33
కుక్కర్ ట్రిక్..

తోడు వేసిన పాల గిన్నెపై మూత పెట్టాలి. ఇప్పుడు.. ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకొని, అందులో కొద్దిగా నీళ్లు పోసి.. పెరుగు గిన్నెను లోపల పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి.. తక్కువ మంట మీద 12 నుంచి 15 నిమిషాలు వదిలేయాలి. విజిల్ మాత్రం పెట్టకూడదు. కుక్కర్ లోపల ఉండే ఉష్ణోగ్రత బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి అవసరమైన వాతావరణాన్ని త్వరగా సృష్టిస్తుంది. ఒక గంట తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే.. పెరుగు గడ్డలా మారి కనపడుతుంది. జున్నులాగా.. పెరుగు గడ్డలా మారుతుంది. కమ్మగా రుచిగా కూడా ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన చిట్కాలు:

ఫ్రిజ్ ట్రిక్: కుక్కర్ నుండి తీసిన వెంటనే ఆ పెరుగును నేరుగా 1 గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచితే మరింత గట్టిగా, హోటల్ స్టైల్‌లో గడ్డ పెరుగులా తయారవుతుంది. నీళ్ల పాలు కాకుండా చిక్కటి ఫుల్ క్రీమ్ పాలను వాడితే పెరుగు మీగడతో సహా చాలా చిక్కగా వస్తుంది. ఇకపై పెరుగు తోడు పెట్టుకోవడం ఆలస్యం అవుతుందనే టెన్షన్ లేకుండా.. ఈ కుక్కర్ ట్రిక్ వాడితే సరిపోతుంది. ఇలా తయారు చేసిన పెరుగు రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories