తెలుగువాళ్ల టిఫిన్ ''పెసరట్టు'' ఇప్పుడు లోకల్ కాదు... నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల జాబితాలో చోటు దక్కించుకుంది.
''పెసరట్టు అంటే నేషనల్ అనుకుంటివా..? ఇంటర్నేషనల్..!! నీయవ్వ తగ్గేదేలే..!'' అని తెలుగు ప్రజలు డైలాగ్ కొట్టే రోజు వచ్చేసింది. మన పెసరట్టు కూడా వరల్డ్ వైడ్ హిట్ అయ్యింది. పెసరట్టుకు ఇంత ఎలివేషన్ డైలాగ్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఈ విషయం తెలిస్తే మీరుకూడా ఈ తెలుగోళ్ల టిఫిన్ గురించి గొప్పలు చెప్పుకుంటారు.
అసలు మ్యాటర్ ఏంటంటే... ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సాంప్రదాయ వంటకాలు, స్థానిక పదార్థాలను పరిశీలించి వాటికి ర్యాంకులు ఇస్తుంటుంది ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్. తాజాగా 2026 కు సంబంధించి ఈ ఫుడ్ గైడ్ రిలీజ్ చేసిన ప్రపంచంలోని బెస్ట్ ప్యాన్‌కేక్ రెసిపీల లిస్ట్‌లో మన పెసరట్టుకు చోటు దక్కింది. టేస్ట్‌అట్లాస్ రిలీజ్ చేసిన వరల్డ్ 100 బెస్ట్ ఫుడ్స్ లిస్ట్‌లో 11 భారతీయ వంటకాలు చోటు దక్కించుకున్నాయి...ఇందులో పెసరట్టు కూడా ఉంది.
24
టాప్ లేపిన మన మసాలా దోశ...
ఆహార ప్రపంచంలో రుచికి పాస్‌పోర్ట్ అవసరం లేదని మరోసారి రుజువైంది. ఒకప్పుడు సౌత్ ఇండియాకే ఐకాన్‌గా ఉన్న మసాలా దోశ ఇప్పుడు గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటుతోంది. ప్రపంచంలోని బెస్ట్ ప్యాన్‌కేక్ రెసిపీల లిస్ట్‌లో మసాలా దోశ ఏకంగా 6వ స్థానం దక్కించుకుంది. పాశ్చాత్య దేశాల్లో పాపులర్ వంటకాలను కూడా మసాలా దోశ వెనక్కి నెట్టేసింది.
సాధారణంగా ప్యాన్‌కేక్స్ అంటే అందరికీ ఫ్రెంచ్ క్రేప్స్ లేదా అమెరికన్ ప్యాన్‌కేక్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి, భారతీయ రుచి అందరి దృష్టిని ఆకర్షించింది. మసాలా దోశ కేవలం ఒక వంటకం కాదు, అదొక అనుభూతి. పైన కరకరలాడుతూ, లోపల మసాలా ఆలుగడ్డ స్టఫింగ్‌తో ఉంటుంది. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో కలిపి తింటే దీని రుచే వేరు. ఈ బ్యాలెన్స్‌డ్ టేస్టే గ్లోబల్ లిస్ట్‌లో దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.
34
ప్రపంచం మెచ్చిన ఇండియన్ దోశలివే..
ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారతీయ మసాలా దోశ 4.3 స్టార్ రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడు దోశ 15, తమిళనాడు పేపర్ దోశ 35, కేరళ అప్పం 60, ఆంధ్రప్రదేశ్ పెసర దోశ (పెసరట్టు) 63, తమిళనాడు ఊతప్పం 74, కర్ణాటక నీర్ దోశ 84, మాల్పువా 85, కేరళ కల్లప్పం 95, రవ్వ దోశ 96, ఒడిశా పితా 97 ర్యాంకులు సాధించాయి.
టేస్ట్‌అట్లాస్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ప్యాన్ కేక్ లాట్వియాకు చెందిన 'కార్టుపెలు పన్‌కుకాస్' (సాంప్రదాయ బంగాళాదుంప ప్యాన్‌కేక్)... ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన 'క్రేప్స్ సుక్రీస్', 'క్రేప్స్' ఉన్నాయి. ఇక స్వీట్ ప్రియులు ఇష్టపడే ఫ్రాన్స్ 'నుటెల్లా క్రేప్స్' కూడా టాప్ 5లో చోటు దక్కించుకుంది.