New Clothes: కొత్త బట్టలు చూడగానే తాజాగా ఉంటాయి… నిగనిగలాడుతూ వెంటనే వేసుకోవాలనిపిస్తుంది. అందరూ కొత్త బట్టలను నేరుగా వేసుకుంటారు. వాటిని ఉతికి వేసుకోవాలని కూడా ఎవరికీ తెలియదు. అలా వేసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
కొత్త దుస్తులు కొంటే అందరికీ పండగే. ప్రతి నెలా కొత్త బట్టలు కొని వేసుకునే వారు ఉన్నారు. అయితే ఆ దుస్తులను ఉతికి వేసుకునే వారు చాలా తక్కువే. షాపు నుంచి తెచ్చాక నేరుగా వాటిని ధరిస్తారు. కానీ ధరించడం చాలా ప్రమాదం. ఎందుకంటే దుస్తులు ఫ్యాక్టరీల నుంచి గోదాములు, ఓడలు, ఆ తర్వాత షాపులకు సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి. ఈ సమయంలో వాటిపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్ భారీగా చేరుతాయి అలాంటివాటిని ధరిస్తే ఒక్కోసారి తీవ్ర చర్మ సమస్యలు రావచ్చు.
24
ఎంతో మంది చేతులు మారి...
షాపులో మీరు ఒక డ్రెస్ కొనే ముందు, దాన్ని చాలా మంది టచ్ చేసి ఉంటారు. కొందరు వేసుకుని ట్రై చేసి ఉంటారు. వారి చర్మం, చెమట ఆ బట్టలకు అంటుకునే ప్రమాదం ఉంది. చెమలో ఎన్నో బ్యాక్టిరియాలు ఉంటాయి. అవి తిరిగి మీకు కూడా చేరే అవకాశం ఉంది.
34
ప్రమాదకరమైన రసాయనాలు
దుస్తుల రంగు, డిజైన్ పాడవకుండా ఉండేందుకు వాటి తయారీలో ఎన్నో రకరకాల రసాయనాలు వినియోగిస్తారు. కాబట్టి వీటిని ఉతకకుండా వేసుకుంటే చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు రావచ్చు. ఇక లోదుస్తులు, జిమ్ బట్టలు నేరుగా చర్మానికి అతుక్కుని ఉంటాయి. కాబట్టి వాటిని వాడే ముందు కచ్చితంగా ఉతకడం ఆరోగ్యానికి చాలా అవసరం.
పెద్దలతో పోలిస్తే పిల్లల దుస్తుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలి. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొత్త బట్టల్లోని రసాయనాలు వారి చర్మంపై సులభంగా అలర్జీలు, ఇరిటేషన్ కలిగించగలవు. అందుకే వారికి వేసే ముందు తప్పకుండా ఉతకాలి కొత్త బట్టలను ఒకసారి ఉతకడం కేవలం శుభ్రత కోసమే కాదు, అదొక చర్మ సంరక్షణ అలవాటు కూడా. ఇది మనల్ని ఎన్ననో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.