Improving Memory: ఇలా చేస్తే ‘మర్చిపోయా ’అన్న ముచ్చటే ఉండదు తెలుసా..!

First Published Jun 26, 2022, 11:49 AM IST

Improving Memory: అయ్యో ఆ సంగతే మర్చిపోయానే.. ఆ.. నీపేరు ఏమో ఉండే.. వంటి ఎన్నో చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోయే వారు చాలా మందే ఉన్నారు. దీనికంతటికి కారణం మీ జీవన శైలి. మరి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జ్ఞాపకశక్తి అనేది మెదడు ద్వారా నిర్వహించబడే ఒక సమగ్ర విధి. మెమరీ పవర్ అనేది బ్రెయిన్ అందుకునే ఏదైనా సమాచారాన్ని రికార్డ్ చేయడం, నిల్వ చేయడం, గుర్తుంచుకోవడం వంటివి తెలియజేస్తుంది. అయినప్పటికీ కొందరికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోతుంటారు.లేదా విషయాలను తప్పుగా గుర్తుపెట్టుకుంటారు. అనేక కారణాలు మీ మెదడు జ్ఞాపకశక్తి పని తీరు క్షీణించడానికి కారణమవుతాయి. అయితే కొన్నిసింపుల్ టిప్స్ తో మీ మెమోరీ పవర్ ను పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ధ్యానం (Meditation)

మనస్సును రీసెట్ చేయడానికి, ఎనర్జిటిక్ గా ఉంచడానికి ధ్యానం (Meditation) ఒక ప్రభావవంతమైన మార్గం. మనస్సులో స్పష్టత లేకపోవడం ఇలాంటి సమస్య తలెత్తుతుంది. అలాగే ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety), Burnout మొదలైన వివిధ కారకాల వల్ల ఇది జరగవచ్చు. ధ్యానం మనస్సును ఉత్తేజంగా ఉంచడానికి, పునరుజ్జీవింపజేయడానికి సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరుస్తుంది.

బాగా నిద్రపోండి

తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా దేనిపై ఇంట్రెస్ట్ ఉండదు. ఇతరులు చెప్పింది అర్థం కాదు. అలాగే ఏకాగ్రత కూడా ఉండదు. నిద్రపోవడం వల్లే శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే ఇది మనస్సులో స్పష్టతను పెంచుతుంది. అందుకే టైం ప్రకారం నిద్రపోండి. ఇందుకోసం అలారాన్ని సెట్ చేసుకోండి. సరైన Sleep schedule మీకు అవసరమైన విశ్రాంతిని పొందడానికి సహాయపడుతుంది.
 

మనస్సు వ్యాయామం చేయండి

మీ జ్ఞాపకశక్తి పెంచడానికి సహాయపడే ఉత్తమ మార్గాల్లో మనస్సును చురుగ్గా ఉంచడం ఒకటి. జ్ఞాపకశక్తికి మెరుగుపరిచేందుకు మనస్సు వ్యాయామాలు అంటే ఆటలను కూడా ఆడొచ్చు. చదరంగం (Chess), సుడోకు (Sudoku) మొదలైన మైండ్ గేమ్స్ ను ఆడినా మీ మెమోరీ పవర్ పెరుగుతుంది. 
 

కొత్త విషయాలను ప్రయత్నించండి

మీరు కొన్ని పనులను పదేపదే చేసినప్పుడు మీ మెదడు వాటికి అలవాటుపడుతుంది.  ఈ విషయాలను మీ మైండ్ మర్చిపోదు. అంటే మీరు కొన్ని సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నట్టైతే.. బ్రేకులు లేదా యాక్సిలరేటర్లను ఎప్పుడు నొక్కాలో మీ మెదడును మీరు నిర్దేశించాల్సిన అవసరం లేదు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో నిమగ్నం కావడం లేదా కొత్త కార్యకలాపాలను ప్రయత్నించడంలో నిమగ్నం కావడానికి చేతన ప్రయత్నం అవసరం. కొత్త కొత్త ఆటలు, పాటలు, డ్యాన్స్, భాష మొదలైనవి నేర్చుకోవడం వల్ల మెదడును ఉత్తేజపడుతుంది. అలాగే మీ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. 


వ్యాయామం

వ్యాయామంతో మానసిక ఆరోగ్యమే కాదు.. శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇవి శక్తి సామర్థ్యాలను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో అనేక మెదడు విధులతో సహా వివిధ విధులను పెంచడానికి సహాయపడుతుంది. వ్యాయామం వివిధ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మనకు శక్తివంతంగా, సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో ఈ హార్మోన్లు లేకపోవడం వల్ల  మానసిక స్థితిపై, ఏకాగ్రతపై ప్రతికూలంగా ప్రభావం పడుతుంది. 
 

memory

సాంఘికీకరించండి

మెదడుకు దాని విధులను పెంచడానికి వివిధ హార్మోన్లు అవసరం. మన మనోభావాలను అలాగే మన మెదడు సామర్థ్యాలను గొప్పగా ప్రభావితం చేసే వివిధ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సామాజంతో కలిసి ఉండాలి. ఇతరులతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే మెమోరీ పవర్ మెరుగుపడుతుంది. డోపామైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిలో కొరతకు నిరాశ, ఆందోళన మొదలైన రుగ్మతలు కారణాలు. ఇవి మెదడు జ్ఞాపకశక్తి విధులను మరింత దిగజార్చుతుంది.

సరిగ్గా తినండి

మీ మెదడు, శరీరం బాగా పనిచేయాలంటే మొదట మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని బలమైన ఆహారాలను తినాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు హార్మోన్ల ఉత్పత్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం, డార్క్ చాక్లెట్, పసుపు వంటి ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని నిరూపించబడింది.
 

click me!