Diabetes: రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఇక మెడిసిన్ అవసరం లే.. ఈ మసాలా దినుసొక్కటుంటే చాలు

Published : Jun 26, 2022, 09:41 AM IST

Diabetes: మధుమేహులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

PREV
19
 Diabetes: రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఇక మెడిసిన్ అవసరం లే.. ఈ మసాలా దినుసొక్కటుంటే చాలు

ఈ రోజుల్లో డయాబెటిస్ సమస్య సర్వ సాధారణంగా మారింది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో.. మధుమేహ రోగులు వంటగదిలో ఎల్లప్పుడూ ఉండే ఒక ప్రత్యేక మసాలా దినుసును తప్పక తినాలని నిపుణులు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

29

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పసుపు తినాలి:  మధుమేహులు నూనె (Oil), సుగంధ ద్రవ్యాలు (Spices), తీపి (Sweet) ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వీటికి బదులుగా రోజూ కొంత మొత్తంలో పసుపు (Turmeric powder)ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ (Blood sugar levels)కంట్రోల్ అవుతాయి. గ్రేటర్ నోయిడాలోని జిఐఎంఎస్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్..  మధుమేహులకు పసుపు ఏ విధంగా మేలు చేస్తుందో వివరించారు. 

39

పసుపు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు:

మధుమేహ వ్యాధిగ్రస్తులకు (diabetics)పసుపు ఔషధం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది.

 

49

మధుమేహులు పసుపు, నల్ల మిరియాలను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

59

అధిక కొలెస్ట్రాల్ (High cholesterol)ఉంటే కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది కలగవచ్చు. ఈ  సమస్యను తొలగించేందుకు పసుపు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది.

69
Turmeric

పసుపులో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant), యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory)లక్షణాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.

 

79

పసుపును నీటిలో కలిపి తాగితే మైగ్రేన్ (Migraine) సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. పసుపును తీసుకోవడం ద్వారా శరీరంలో ఎలాంటి మంట ఉండదు. 

89

పసుపు జీర్ణక్రియ (Digestion)ను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్దకం (Constipation) వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇది కడుపు సమస్యలకు చక్కటి మెడిసిన్ వంటిది. 
 

99

పసుపు సహాయంతో రక్తస్రావాన్ని (Bleeding)నివారించవచ్చు. గాయం లేదా బెణుకు ఉన్నప్పుడు దీని పేస్ట్ అప్లై చేస్తే.. ఉపశమనం లభిస్తుంది.  పసుపు పేస్ట్ ను అప్లై చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories