Weight Gain Tips: సన్నగా ఉన్నానే అని.. ఫీలైపోతున్నారా? అయితే ఈ పండ్లు, కూరగాయలను తినండి.. బరువు పెరుగుతారు..

Published : Jun 26, 2022, 10:38 AM IST

Weight Gain Tips: బరువు పెరగాలనుకునే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే బరువు పెరగడం సంగతి పక్కనుంచితే.. లేని పోని రోగాలొచ్చే అవకాశం ఉంది మరి.. 

PREV
19
Weight Gain Tips: సన్నగా ఉన్నానే అని.. ఫీలైపోతున్నారా? అయితే ఈ పండ్లు, కూరగాయలను తినండి.. బరువు పెరుగుతారు..

ఆహారం మన శరీరానికి ఇంధనంగా పనిచేస్తుంది. అందుకే మనం తినే ఆహారం మన శరీరాన్ని, మన శరీర బరువును ప్రభావితం చేస్తుంది. మనం రోజూ తీసుకునే వివిధ రకాల పండ్లు (Fruits),  కూరగాయలు (Vegetables) బరువు తగ్గడానికి లేదా పెరగడానికి దోహదపడతాయి. బరువు పెరగడానికి కొంతమంది మాంసాహారాన్ని ఎక్కువగా తినమని సలహానిస్తుంటారు. ఒకవేళ మీరు పాలు, నాన్ వెజ్ తినకుండా బరువు పెరగుదామనుకుంటే మాత్రం మీ రోజు వారి ఆహారంలో ఈ కూరగాయలను, పండ్లను చేర్చుకోండి. 

29

అరటిపండ్లు (Bananas)

మీరు బరువు పెరగాలనుకుంటే మాత్రం మీ రోజు వారి ఆహారంలో అరటిపండ్లను తప్పక చేర్చుకోండి. దీనిలో చక్కెర (Sugar), ఫైబర్ (Fiber) పుష్కలంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే వీటిలో ఉండే సహజ చక్కెర చాలా ఆరోగ్యకరమైంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను ఫాస్ట్ గా చేస్తుంది. అలాగే అరటి పండు కడుపును ఎక్కువ సేపు నిండుగా కూడా ఉంచుతుంది. 

39

డ్రై ఫ్రూట్స్ (Dry Fruits)

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు (Nutrients), ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats)పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి మీకు సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ (Dry Fruits), గింజల (Nuts) ను మీ అల్పాహారంలో చేర్చుకోండి. ఎండిన పండ్లలో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. వివిధ అనారోగ్య సమస్యలను తొలగించడానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. 

49


కొబ్బరి నీళ్లు (Coconut water)

కొబ్బరి నీళ్లలో (Coconut water) కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే ఇది గొప్ప పానీయం అయినప్పటికీ.. మరోవైపు బరువు పెరగడానికి కొబ్బరి ముక్కలు  (coconut meat) ఎంతో సహాపడుతాయి. కొబ్బరి కూడా బహుముఖమైనది. కొబ్బెరను, కొబ్బరి పాలను వివిధ మార్గాల్లో తీసుకోవచ్చు. ఇందులో కొవ్వు, మాంగనీస్, సెలీనియం మొదలైనవి అధికంగా ఉంటాయి. ఇది రాగి, భాస్వరం వంటి ఖనిజాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది.

59

మామిడి (Mango)

మామిడి పండ్లలో పిండి పదార్థాలు (Carbohydrates), చక్కెర (Sugar)అధికంగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.  ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా జంక్ ఫుడ్స్ మాదిరిగా కాకుండా అవి కేలరీల యొక్క ఆరోగ్యకరమైన వనరు. ఇందులో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రోటీన్ మొదలైనవి కూడా అధికంగా ఉంటాయి.
 

69

బరువు పెరగడానికి సహాయపడే కూరగాయలు:

అవొకాడో (Avocado)

అవకాడోలలో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారికి ఇది గొప్ప వనరు. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇతర ముఖ్యమైన పోషకాలను శోషించుకోవడానికి శరీరానికి సహాయపడతాయి. ఇది ఫైబర్, ప్రోటీన్, విటమిన్ కె, ఫోలేట్, ఇతర పోషకాల గొప్ప మూలం.
 

 

79

మొక్కజొన్న (Corn)

బరువు పెరగాలనుకునే వారు ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం మొక్కజొన్న. దీనిలో ఆరోగ్యకరమైన కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మొక్కజొన్నలను గింజల రూపంలో లేదా పిండిగా లేదా పాప్ కార్న్ వంటి మొదలైన వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి మొదలైనవి కూడా పుష్కలంగా ఉంటాయి.

89

బఠాణీలు 

బఠానీలు అధిక కేలరీలను కలిగి ఉన్న మరొక ఆహారం. ఇది చాలా పోషకాహారం కూడా. పచ్చి బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ బరువు పెరగడానికి సహాయపడతాయి. పచ్చి బఠానీలు విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్ మొదలైన వాటికి గొప్ప మూలం.
 

 

99

బంగాళాదుంపలు (Potatoes)

బంగాళదుంపలు బరువు పెరిగే కూరగాయలుగా ప్రసిద్ధి చెందాయి.  ఉడకబెట్టిన లేదా కాల్చిన బంగాళాదుంపలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరంగా బరువుపెరుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories