పాత మోడల్ ఫ్రిజ్‌లలో ఫ్రీజర్ నిండా ఐస్ గడ్డకట్టడం కామన్. ఆ ఐస్‌ను త్వరగా తీసేయాలని చాలామంది కత్తి లేదా పదునైన వస్తువులతో పొడుస్తుంటారు. ఇది చాలా డేంజర్. ఐస్‌ను పగలగొట్టేటప్పుడు కత్తి పొరపాటున కూలింగ్ పైపుకు తగిలితే, అందులోని గ్యాస్ లీక్ అవుతుంది.
R600a లాంటి త్వరగా మంటలు అంటుకునే గ్యాస్ వాడే ఫ్రిజ్‌లలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐస్ గడ్డకడితే మాన్యువల్‌లో చెప్పినట్లు డీఫ్రాస్ట్ బటన్ నొక్కి కరిగించండి. అంతేగానీ కత్తి, స్క్రూ డ్రైవర్ లాంటివి అస్సలు వాడకండి.
ఫ్రిజ్ కూలింగ్ సిస్టమ్ పాడైతే గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే, ఫ్రిజ్ దగ్గర అగ్గిపెట్టె, లైటర్ లాంటివి అస్సలు వెలిగించొద్దు. అలాగే ఫ్రిజ్ కూలింగ్ పైపును మీరే సొంతంగా రిపేర్ చేయడానికి ట్రై చేయకండి.
గ్యాస్ లీక్ అవుతోందని డౌట్ వస్తే వెంటనే కిటికీలు, తలుపులు తీసి గాలి ఆడేలా చేయండి. ఆ తర్వాత టెక్నీషియన్‌ను పిలిపించి చెక్ చేయించండి. గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు నిప్పు పుట్టించే పనులు చేయకపోవడం చాలా ముఖ్యం.