Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే కుక్కర్ పేలే ప్రమాదాన్ని పెంచేస్తాయి. చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం వల్ల కుక్కర్ బాంబులా పేలిపోయే ముప్పు ఉంటుంది.
ఇప్పుడు ప్రతిఒక్కరి ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్ కచ్చితంగా ఉంటుంది. తక్కువ టైమ్‌లో వంట పూర్తి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ దాని వాడకం విషయంలో చిన్న చిన్న తప్పులు చేసినా, కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అది బాంబులా పేలి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కుక్కర్ పేలిన సంఘటనలు మీరు ఎన్నో వినే ఉంటారు. కొన్ని సాధారణ తప్పులే ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కింద చెప్పిన తప్పులు చేయకూడదు.
26
కుక్కర్‌ను పూర్తిగా నింపకండి
కుక్కర్ వాడడం వల్ల సమయంతో పాటూ గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కానీ, దాన్ని అజాగ్రత్తగా వాడితే ప్రాణాలకే ప్రమాదం. చాలామంది వంట తొందరగా అవ్వాలని కుక్కర్ నిండా పదార్థాలు వేసేస్తారు. కానీ, కుక్కర్ సామర్థ్యంలో 2/3 వంతుకు మించి నింపకూడదు. ముఖ్యంగా పప్పు, బియ్యం వంటివి ఉడికేటప్పుడు పొంగుతాయి. కాబట్టి వాటిని సగం వరకు మాత్రమే నింపడం సేఫ్.
36
గ్యాస్కెట్ (రబ్బర్) నాణ్యత
కుక్కర్ మూతకు ఉండే రబ్బర్ (గ్యాస్కెట్) లూజ్‌గా అయినా, పగుళ్లు వచ్చినా వెంటనే మార్చేయాలి. సరిగ్గా లేని గ్యాస్కెట్ వల్ల ఆవిరి (Steam) పక్కనుంచి లీక్ అవుతుంది. దీనివల్ల లోపల సరైన ప్రెజర్ ఏర్పడదు, పైగా అది ప్రమాదకరంగా మారొచ్చు.
కుక్కర్‌లో సరిపడా నీళ్లు వేయకుండా స్టవ్ మీద పెట్టడం చాలా ప్రమాదకరం. నీళ్లు లేకపోతే కుక్కర్ అడుగుభాగం మరీ ఎక్కువగా వేడెక్కి 'సేఫ్టీ వాల్వ్' పేలిపోవడానికి కారణమవుతుంది. అందుకే వండే పదార్థాన్ని బట్టి సరైన మోతాదులో నీళ్లు పోయడం చాలా ముఖ్యం.
56
వెంట్ పైప్ శుభ్రత
ప్రెషర్ కుక్కర్ మూతపైన ఉండే వెంట్ పైప్ (విజిల్ కింద ఉండే రంధ్రం) ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అందులో ఆహార పదార్థాల ముక్కలు ఇరుక్కుంటే, లోపల ఏర్పడిన ఆవిరి బయటకు వెళ్లలేదు. దీనివల్ల లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
66
బలవంతంగా మూత తీయకండి
కుక్కర్‌లోని ప్రెషర్ పూర్తిగా తగ్గిన తరువాత పైన మూత తీయాలి. అలా తగ్గకుండా మూతను బలవంతంగా తీయడానికి ప్రయత్నించకూడదు. విజిల్ తీసినా లోపల ఇంకా కొద్దిగా ఆవిరి ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాతే మూతను తీయాలి. బలవంతంగా తీస్తే కుక్కర్ పేలే అవకాశాలు ఎక్కువ. ఈ ఐదు జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు సురక్షితంగా వంట చేయవచ్చు.