చాలా మంది ఈ విషయంలో పొరపడుతూ ఉంటారు. ఏవైనా పండ్లు లేదా కూరగాయలపై రెండు గాట్లు కనిపిస్తే.. పాము కరిచిందని భయపడతారు. అందులో విషం ఉంటుందని.. తినడానికి సంకోచిస్తారు. కానీ... పాములు శాకాహారులు కావు. అవి ఆకులు, పండ్లు, కూరగాయలు పొరపాటున కూడా తినవు. అందు వల్ల పాములు పండ్లు, కూరగాయలను కాటు వేసి.. అందులో విషం ఎక్కే అవకాశాలు తక్కువ. వాటి కోరలు ఈ పండ్లు, కాయలను కొరికేవిధంగా ఉండవు.
ఒకేవేళ, పాము ఏదైనా పండుకు విషం ఎక్కించినా, ఆ పండును తినడం వల్ల మనిషి చనిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ. పాము విషం రక్తంలో ప్రవేశించినప్పుడు మాత్రమే అది ప్రమాదకరంగా మారుతుంది. మనం ఈ విషాన్ని పండు ద్వారా తిన్నప్పుడు, అది కడుపులోకి చేరుకొని, అక్కడి బలమైన ఆమ్లాలు విషాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.