ఇవి షుగర్ ముందస్తు లక్షణాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. తరచుగా గొంతు ఎండిపోవడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గడం కూడా డయాబెటీస్ లక్షణాలే. ఎప్పుడూ ఆకలిగా అనిపించినా, తరచుగా వాంతులు, విరేచనాలు, కాళ్లలో స్పర్శ తగ్గినా ఈ వ్యాధి లక్షణాలే. చర్మం ముడతలు పడ్డా, కంటి చూపు తగ్గినా, దంతాల చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు రావడం కూడా షుగర్ లక్షణాలే.