సెక్స్ కి దూరమౌతున్న దంపతులు.. కారణం ఇదే..!

First Published | Jan 14, 2022, 9:28 AM IST

దంపతులకు శృంగారం పట్ల ఆసక్తి తగ్గడం కూడా చాలా సర్వ సాధారణం. దాని పట్ల కాస్త దృష్టి పెట్టి.. మనసుతో ఆలోచిస్తే.. ఎలాంటి సమస్య అయినా.. సులభంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు

సెక్స్ అనేది ఒక ఆనందదాయకమైన, సంతృప్తికరమైన కార్యకలాపం. పెళ్లైన కొత్తలో.. సెక్స్ పట్ల ఆసక్తిగా ఉంటారు. అదే ప్రపంచంగా గడిపేస్తారు.అయితే, కొంతకాలం తర్వాత, చాలా మంది దంపతులు క్రమం క్రమంగా సెక్స్ కి దూరమైపోతుంటారు.. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండొచ్చు. దంపతులకు శృంగారం పట్ల ఆసక్తి తగ్గడం కూడా చాలా సర్వ సాధారణం. దాని పట్ల కాస్త దృష్టి పెట్టి.. మనసుతో ఆలోచిస్తే.. ఎలాంటి సమస్య అయినా.. సులభంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు.. దంపతులు శృంగార జీవితానికి వారికి తెలీకుండానే దూరమైపోతారట. వాటికి గల కారణాలేంటో ఓసారి చూసేద్దాం..
 

before marraige


1.దంపతులు శృంగార జీవితానికి దూరం కావడానికి మొదటి కారణం.. బోర్. మీరు చదివింది నిజమే. బోర్ కొట్టడం అంటే.. మనిషి పట్ల కాకపోవచ్చు. చేసే విధానం వల్ల కూడా కావచ్చు. రోటీన్ ఎప్పుడూ బోరింగ్ గానే ఉంటుంది.  మొదట్లో బాగున్నా.. కొంతకాలం తర్వాత విసుగు కలిగిస్తుంది. ఎప్పుడూ ఒకే విధంగా సెక్స్ లో పాల్గొనడం వల్ల.. అది రోటీన్ అీయిపోయి.. దాని పట్ల ఆసక్తి తగ్గతుంది.

Latest Videos


2.ఇక రెండోది.. అపరిశుభ్రత. దంపతులు  ఆనందంగా ఉండాలన్నా.. సెక్స్ జీవితం సజావుగా సాగాలన్నా...  పరిశుభ్రత చాలా ముఖ్యం. మీ పార్ట్ నర్ శుభ్రంగా లేకపోతే.. మొదట్లో భరించినా.. తర్వాతర్వాత.. వారిపై అసహ్యం మొదలౌతుంది. స్నానం చేయకపోవడం, బ్రష్ చేయకపోవడం వల్ల వచ్చే దుర్వాసన కారణంగా.. సెక్స్ పట్ల అయిష్టత మొదలౌతుంది.

3.ఇక మూడో కారణం.. దంపతుల మధ్య గొడవలు. చీటికీ మాటికీ..గొడవలు పడుతూ ఉండే దంపతుల మధ్య.. సెక్స్ జీవితం సజావుగా సాగదు. తొలుత.. గొడవలు పడినా.. కలయికలో పాల్గొంటారు. కానీ.. రాను రాను..

Sex-related

4.ఇక మరో కారణం.. పెళ్లి తర్వాత చాలా మంది  శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువ మంది లావుగా మారిపోతుంటారు.  దాంతో.. వారి శరీరం పట్ల వారు ప్రేమను కోల్పోతారు. మీరు మీ శరీరం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు, దాని గురించి అసురక్షితంగా ఉన్నప్పుడు, సెక్స్ చేయాలనే కోరిక భయం మరియు స్వీయ విధించిన అవమానం నుండి తగ్గిపోతుంది. ఒక భాగస్వామికి కాంప్లెక్స్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకరు ఫిట్‌గా ఉన్నప్పుడు మరియు మరొకరు ఫిట్‌గా లేనప్పుడు ఇది జరుగుతుంది.

5.ఇక మరో ముఖ్య కారణం పని ఒత్తిడి. చాలా పని ఒత్తిడి లేదా మీ అందరినీ ఒత్తిడికి గురిచేసే ఇతర అంశాలు ఉన్నప్పుడు, అది నేరుగా మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు చాలా అలసిపోతారు, మీకు ఏమీ చేయాలని అనిపించదు. మీరు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మరియు విధులను పంచుకోనప్పుడు ఈ ఒత్తిడి మూడు రెట్లు పెరుగుతుంది. మరేదైనా చేసే శక్తి మీకు మిగిలి ఉండదు.

click me!