sankranti 2022 : సంక్రాంతి ఎన్నో సంతోషాలను మూటగట్టుకొస్తుంది. కొత్త అల్లుల్లతో, కోడి పందేలతో, ఇంటి నిండా చుట్టాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ పండుగలో స్పెషల్ అంటే పిండి వంటలు, గొబ్బెమ్మలు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు. ఇక వీటితో పాటుగా గాలిపటాల సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి పండగ రాకముందు నుంచే ఈ పతంగుల జాతర మొదలవుతుంది. ఇక పండగ రోజు పిల్లలు.. పెద్దలు అంటూ తేడా లేకుండా రకరకాల గాలిపటాలు తెచ్చుకుని పోటీలు పెట్టుకుని మరీ ఎగరేస్తూ మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. సంక్రాంతికి గాలి పటాలు ఎగరేస్తారు అనేది అందరికీ తెలుసు.. కానీ ఎందుకు ఈ పండగకే ఎగరేస్తారు.. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ఎవవరికైనా తెలుసా..? పదండి ఈ ఆర్టికల్ చదివి పతంగుల పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకుందాం.