Fish Fry: చేపల ఫ్రైలో ఈ ఒక్కటి వేస్తే చాలు.. టేస్ట్ అదిరిపోతుంది! ఇష్టంగా తినేస్తారు

Published : Oct 30, 2026, 05:18 PM IST

Fish Fry: ఫిష్ ఫ్రైని చాలామంది ఇష్టంగా తింటారు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఫిష్ ఫ్రై చూస్తే ఎవ్వరికైనా నోరూరాల్సిందే. అయితే చేపల ఫ్రై హోటల్ స్టైల్లో రావాలంటే ఈ ఒక్క పదార్థం కలిపితే చాలు.. రుచి అద్భుతంగా ఉంటుంది. మరి అదేంటో తెలుసుకోండి.

PREV
17
చేపల ఫ్రై రుచిని పెంచే పదార్థం

చేపల ఫ్రై అనగానే ప్రతీ ఒక్కరికీ నోరూరిపోతుంది. కానీ ఇంట్లో చేపలు వేయించేటప్పుడు కొన్నిసార్లు మసాలా విడిపోతుంది. మరికొన్నిసార్లు చేప ముక్క గట్టిగా మారిపోతుంది. అయితే ఇకపై ఆ కంగారు అవసరం లేదు. మీరు రోజూ వాడే మసాలాతో పాటు ఈ ఒక్కటి వేస్తే, అది మసాలాను చేప ముక్కకు బాగా పట్టుకునేలా చేసి, పైన క్రిస్పీ లేయర్‌ను ఇస్తుంది. మరి ఆ పదార్థం ఏంటో, రెస్టారెంట్ స్టైల్‌ చేపల ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం.

27
ఇడ్లీ పిండి కలపడం

చేపల ఫ్రై చేసేటప్పుడు మసాలాలో కొద్దిగా ఇడ్లీ పిండి లేదా దోశల పిండి కలిపితే మంచి రుచి వస్తుంది. ఇడ్లీ పిండిలోని బియ్యం, మినప్పప్పు మిశ్రమం మసాలాను చేప ముక్కకు గట్టిగా పట్టి ఉంచుతుంది. దీనివల్ల వేయించేటప్పుడు మసాలా నూనెలో విడిపోదు. అలాగే చేప పైన మంచి కరకరలాడే కోటింగ్ వస్తుంది.

37
మసాలా ఎలా కలుపుకోవాలి?

చేప ముక్కలకు సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తీసుకోవాలి. దీనికి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఇడ్లీ పిండి కలపాలి. తగినంత నిమ్మరసం వేసి చిక్కటి మసాలా పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మసాలాను చేప ముక్కలన్నింటికీ బాగా పట్టించాలి.

47
బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్

ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోతే దానికి బదులుగా బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ కూడా వాడవచ్చు. బియ్యప్పిండి చేప పైన బాగా కరకరలాడేలా చేయడానికి తోడ్పడుతుంది. కార్న్ ఫ్లోర్ మసాలా మిశ్రమం చేప ముక్కకు బాగా పట్టుకోవడానికి, పలచటి క్రిస్పీ లేయర్ రావడానికి సహాయపడుతుంది.

57
నిమ్మరసం, పెరుగు
చేపల ఫ్రై రుచిని పెంచడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. మసాలా కలిపేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా పెరుగు కూడా కలపవచ్చు. ఇది చేప ముక్కను లోపల మెత్తగా ఉంచుతుంది. అయితే నిమ్మరసం లేదా పెరుగును ఎక్కువగా కలపకూడదు. తేమ ఎక్కువైతే మసాలా చేపకు సరిగ్గా పట్టుకోదు. క్రిస్పీ ఫ్రై కోసం మసాలా గట్టిగానే ఉండాలి.
67
మసాలా పట్టించిన తర్వాత..

చేపలకు మసాలా పట్టించిన వెంటనే నూనెలో వేయించకూడదు. కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల మసాలా చేప ముక్కకు బాగా పడుతుంది. వేయించేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. చేపలను మూతపెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఇంకా మంచిది.

77
నూనె వేడెక్కిన తర్వాతే..

చేపల వేపుడు క్రిస్పీగా రావడానికి నూనె వేడి చాలా ముఖ్యం. ముందుగా బాండిలో తగినంత నూనె పోసి మీడియం వేడికి రానివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకూడదు. ఒకవైపు బాగా వేగిన తర్వాతే రెండో వైపునకు తిప్పాలి. పదే పదే తిప్పితే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories