భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంతుండాలి? సైన్స్, సమాజం ఏం చెబుతున్నాయి?

Published : May 19, 2025, 07:08 PM ISTUpdated : May 19, 2025, 07:15 PM IST

భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎతుండాలి?  ఇద్దరిలో ఎవరు పెద్దవారై ఉండాలి? నిజంగానే ఈ వయసు తేడా జీవితం సుఖంగా సాగేందుకు ఉపయోగపడుతుందా?  సమాజం, సైన్స్ ఏం చెబుతున్నాయి? 

PREV
15
ideal age difference in marriage

స్నేహంలో, ప్రేమలో వయస్సును పెద్దగా పట్టించుకోరు. కానీ పెళ్లి విషయంలో మాత్రం వయసును పరిగణనలోకి తీసుకుంటారు. జీవితాంతం కలిసి జీవించాలంటే ఇద్దరిమధ్య మంచి అవగాహన అవసరం... ఇందుకు ఇద్దరిమధ్య వయసు బాగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఎంత ఉండాలి? అనేది చాలా కీలకం. ఈ అంశంపై సాంప్రదాయ ఆలోచనలు, శాస్త్రీయ విశ్లేషణ రెండు వైపుల నుంచి పరిశీలన అవసరం.

25
ideal age difference in marriage

భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంతుండాలి?

భారతీయ సమాజంలో సాధారణంగా భర్త భార్య కన్నా భర్త మూడు నుంచి ఐదు సంవత్సరాలు వయస్సులో పెద్దవాడిగా ఉండాలని నమ్మకం ఉంది. ముఖ్యంగా పెద్దలు పెళ్లి కుదిర్చే సమయంలో ఇద్దరి వయసు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు... ఇద్దరి మధ్య ఎక్కువ వయసు తేడా ఉండకుండా చూసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ వయసు తేడాను పెద్దగా పట్టించుకోరు. దీంతో భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండి ఇది విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. అన్నిసార్లు ఇలాగే జరగే అవకాశం లేదు.. ఎందుకంటే వయసు తేడా ఎక్కువగా ఉన్న జంటలు కూడా హాయిగా జీవిస్తున్నారు. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మోడల్ మీరా రాజ్‌పుత్‌ల మధ్య 15 ఏళ్ల తేడా ఉంది. అలాగే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌కి 10 ఏళ్ల తేడా ఉంది ఈవిధంగా వయస్సు తేడాను తేలికగా తీసుకుంటూ సుఖంగా జీవిస్తున్న దంపతులు ఉన్నారు.

35
ideal age difference in marriage

భార్యాభర్తల వయసుపై సైన్స్ ఏమంటోంది?

భార్యాభర్తల వయస్సు తేడా కేవలం ఒక అభిప్రాయం మాత్రమే కాదు. శాస్త్రపరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. శారీరక, మానసిక పరిపక్వత విషయంలో గర్ల్స్ సాధారణంగా ఎక్కువ వేగంగా ఎదుగుతారు. సాధారణంగా అమ్మాయిలలో హార్మోనల్ మార్పులు 7 నుంచి 13 ఏళ్ల మధ్య ప్రారంభమవుతాయి. అబ్బాయిల్లో ఇవే మార్పులు 9 నుంచి 15 ఏళ్ల మధ్య వస్తాయి. అందువల్ల మహిళలు మానసికంగా వేగంగా పరిపక్వత సాధిస్తారు.

45
ideal age difference in marriage

పెళ్లికి సరైన వయస్సు ఎంత?

భారతదేశంలో చట్టపరంగా పెళ్లి వయస్సు బాలికలకు 18, బాలురకు 21. ఇది చూస్తే భార్య భర్తల మధ్య కనీసం మూడు సంవత్సరాల తేడా ఉండేలా చూస్తారు. ఇది శారీరక పరిపక్వతకే కాదు, మానసిక అభివృద్ధికి కూడా అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

55
ideal age difference in marriage

అయితే పెళ్లి కేవలం శారీరక పరిపక్వతపై ఆధారపడేది కాదు. భావోద్వేగ పరిపక్వత, అర్ధం చేసుకునే శక్తి, పరస్పర గౌరవం, ప్రేమ వంటి అంశాలే దాంపత్య జీవితాన్ని విజయవంతంగా మార్చతాయి. కనుక వయస్సు తేడా పెళ్లి విజయాన్ని నిర్ణయించదు. మూడు సంవత్సరాల తేడా ఉన్నా, పదిహేనెళ్ల తేడా ఉన్నా... భార్యాభర్తల మధ్య ప్రేమ, ప్రతి విషయంలోనూ పరస్పర అవగాహన ఉంటే చాలు సంసారం జీవింతం సాఫీగా సాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories