ఎమోషన్స్ ఎక్కువ కాలం గుర్తుంటాయి..
మానవ మెదడు భావోద్వేగాలకు సంబంధించిన సంఘటనలను నార్మల్ విషయాల కంటే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ముఖ్యంగా బాధ , కోపం, నిరాశ లేదా అవమానం వంటి భావాలు కలిగిన సందర్భాలు మరింత స్పష్టంగా గుర్తుంటాయి. అందుకే ‘నువ్వు అప్పుడు అలా మాట్లాడావు?’ ‘ ఆరోజు నన్ను పట్టించుకోలేదు?’ అని ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మహిళలు అంటూనే ఉంటారు. సైకాలజిస్టుల పరిశోధనల ప్రకారం.. మహిళలు సాధారణంగా సంబంధాలు, కమ్యూనికేషన్ , ఎమోషన్స్ ని ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే..బయటి వ్యక్తులతో జరిగిన గొడవల కంటే.. ఫ్యామిలీ, స్నేహితులతో జరిగిన వాటిని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు.
పెద్ద గొడవ జరగాల్సిన అవసరమే లేదు...
మహిళలకు గుర్తుండాలి అంటే.. పెద్ద పెద్ద గొడవలు జరగాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట, ఒక చూపు, నిర్లక్ష్యం అన్నీ వారి మనసులో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే, గొడవలో మాటల కంటే టోన్ వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా సందర్భాల్లో మహిళలు మాటల కంటే కూడా ఆ మాట చెప్పిన విధానాన్నే ఎక్కువగా గుర్తుంచుకుంటారు.
గొడవలు జరగకూడదంటే ఏం చేయాలి?
ఏ సంబంధంలో అయినా గొడవలు జరగడం చాలా సహజం. అయితే.. మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అంటే... కోపంలో అయినా వాడే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానించే పదాలను వాడకూడదు. ముఖ్యంగా అరవడం, వ్యంగ్యంగా మాట్లాడటం తగ్గించాలి. ఎదుటివారి భావాలను గౌరవించాలి. కోపంలో మాట్లాడే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే.. గొడవలు జరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది.