1. ఆకారం (Shape):
సాధారణంగా పొడవుగా ఉండే నిమ్మకాయల కంటే రౌండ్‌గా (గుండ్రంగా) ఉండే నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటుంది.
2. బరువు, తొక్క (Weight & Peel):
నిమ్మకాయ పరిమాణంలో చిన్నదైనా, చేత్తో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపిస్తే అందులో గుజ్జు , రసం ఎక్కువగా ఉన్నాయని అర్థం.
పల్చటి , మృదువైన తొక్క ఉన్న కాయల్లో రసం సమృద్ధిగా ఉంటుంది. తొక్క మందంగా లేదా గరుకుగా ఉంటే అందులో రసం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
3. రంగు (Color):
ముదురు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ బాగా పండినట్లు. అలాంటి కాయలో రసం కూడా ఎక్కువగా ఉంటుంది.
లేత ఆకుపచ్చ రంగులో ఉండే కాయలు ఇంకా పూర్తిగా పక్వానికి రావు, కాబట్టి వాటిలో రసం తక్కువగా ఉంటుంది.