ఇంట్లో పచ్చని మొక్కలు పెంచడం ఆరోగ్యానికి, మనసుకు ఎంత మంచిదో మనకు తెలుసు. అలా మనసుకు హాయినిచ్చే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. అయితే ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదని అంటున్నారు వాస్తు నిపుణులు. ఎందుకో.. ఎక్కడ పెంచాలో.. ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం, సంపద, సానుకూల శక్తి కలిసివస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే చాలా ఇళ్లలో మనీ ప్లాంట్‌ను తప్పనిసరిగా పెంచుతుంటారు. అయితే ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం మంచిదికాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. సరైన దిశలో ఉంచితే మంచి ఫలితాలు, తప్పు దిశలో పెడితే ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మరి మనీ ప్లాంట్ ని ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసుకుందామా..
25
ఏ దిశలో పెట్టాలంటే?
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఆగ్నేయ దిశ అగ్నితత్వానికి సంబంధించింది. ఈ దిశకు అధిపతి శుక్రుడు. సంపద, సుఖ సమృద్ధి, ఐశ్వర్యానికి ప్రతీక శుక్రుడు. కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచితే ఇంట్లో ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా వ్యాపారం చేసే వారు లేదా ఉద్యోగంలో ఎదగాలని కోరుకునే వారు తమ ఇల్లు లేదా ఆఫీసులో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
35
ఇంటి లోపల పెంచడం
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం మంచిది. ఈ మొక్కను బాల్కనీ, హాల్ లేదా కిటికీ దగ్గర ఉంచవచ్చు. సూర్యరశ్మి నేరుగా పడకుండా, తగినంత వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచితే మొక్క బాగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని కొందరు నమ్ముతారు. అందుకే ఈ మొక్కను ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండటం మంచిది.
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను నేల మీద పెరగనివ్వకూడదు. ఈ మొక్క పైకి ఎక్కేలా లేదా వేలాడేలా పెంచితే శుభప్రదం. పైకి పెరుగుతున్న మొక్క అభివృద్ధి, పురోగతిని సూచిస్తుంది.
మనీ ప్లాంట్‌ను నార్త్ ఈస్ట్ దిశలో ఉంచకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఈ దిశలో భారమైన వస్తువులు లేదా కొన్ని మొక్కలు ఉంచడం మంచిదికాదట. ముఖ్యంగా మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఉంచితే ఆర్థిక సమస్యలు రావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను ఇంటి బయట, ప్రధాన ద్వారం దగ్గర కూడా పెంచకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
55
మొక్క ఎండిపోకుండా..
మనీ ప్లాంట్‌ను నీళ్లలో, మట్టిలో పెంచుకోవచ్చు. అయితే ఏ విధంగా పెంచినా మొక్క ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మొక్క ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్‌ను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం కూడా శుభప్రదమే.