మొట్టమొదటి స్పెషల్, ఉగాది పండుగకు అర్థం తీసుకొచ్చే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం. వేపపువ్వు, బెల్లం, చింతపండు, మామిడి ముక్కలు, కారం, ఉప్పు కలిపి చేసే ఈ పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. జీవితం కూడా సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆనందం వంటి అనుభవాలతో నిండి ఉంటుందని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజు ప్రతి ఇంట్లో ఈ పచ్చడిని తప్పకుండా తయారు చేస్తారు.