Ginger Chutney: అల్లం పచ్చడి ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది.. నెల రోజులైనా పాడవ్వదు!

Published : Nov 24, 2026, 05:43 PM IST

Ginger Chutney: అల్లం పచ్చడిని చాలామంది ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి కూడా బాగుంటుంది. మరి ఈ పచ్చడిని రుచిగా, ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఎలా రెడీ చేయాలో చూద్దాం.

PREV
16
అల్లం పచ్చడి రెసిపీ

ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే హడావుడిలో రోజూ ఏం వండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే అలాంటివారికి అల్లం పచ్చడి బెస్ట్ ఆప్షన్. ఒకేసారి తయారు చేసుకుని సరైన విధంగా నిల్వ చేసుకుంటే అవసరమైనప్పుడు అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి వాడుకోవచ్చు. మరి టేస్టీ అల్లం పచ్చడిని తక్కువ టైంలో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

26
కావాల్సిన పదార్థాలు

అల్లం ముక్కలు 250 గ్రాములు,

చింతపండు 100 గ్రాములు,

బెల్లం 150 గ్రాములు,

ఎండుమిర్చి 15 నుంచి 20,

పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు,

మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు,

ధనియాలు 2 టేబుల్ స్పూన్లు,

జీలకర్ర 1 టీస్పూన్,

మెంతులు అర టీస్పూన్,

ఆవాలు 1 టీస్పూన్,

కరివేపాకు 2 రెబ్బలు,

పసుపు అర టీస్పూన్,

ఉప్పు తగినంత,

నూనె 100 మి.లీ. తీసుకోవాలి.

వెల్లుల్లి 8 నుంచి 10 రెబ్బలు

తాలింపు కోసం మరో అర టీస్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు సిద్ధంగా ఉంచుకోవాలి.

36
తయారీ విధానం

అల్లం పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడి అయ్యాక, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. దానికి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు కలపాలి. మంటను సిమ్‌లో పెట్టి, అల్లం పచ్చి వాసన పోయి బాగా వేగే వరకు వేయించాలి.

46
7 నుంచి 8 నిమిషాల వరకు..

వేయించిన పదార్థాలు బాగా చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి పచ్చడిలా రుబ్బుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి, ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేయాలి. ఆ తర్వాత రుబ్బుకున్న అల్లం పేస్ట్, ఇంగువ పొడి, బెల్లం కలపాలి. తక్కువ మంట మీదే 7 నుంచి 8 నిమిషాల పాటు, పచ్చడి బాగా దగ్గరపడి నూనె పైకి తేలే వరకు వేయించి దించేయాలి.

56
నిల్వ చేసుకునే చిట్కాలు

పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే, తడి లేని శుభ్రమైన గాజు లేదా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పచ్చడి తీసేటప్పుడు తడి చెంచాను వాడకూడదు. ఇలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే, వారాల తరబడి లేదా దాదాపు రెండు నెలల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఉదయం వంట హడావిడిని ఇది బాగా తగ్గిస్తుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని కలుపుకుని తింటే సూపర్ గా ఉంటుంది.

66
ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి పర్ఫెక్ట్

ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ రెసిపీల్లోకి ఇది మంచి సైడ్ డిష్‌గా ఉంటుంది. తక్కువ మంటపై బాగా వేయించి నూనెలో తాలింపు వేయడం వల్ల, ఇది త్వరగా పాడవదు. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం పచ్చడి చక్కగా సహాయపడుతుంది. జలుబు, దగ్గు లాంటి ఇబ్బందులకు ఉపశమనం ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories