Oats: ప్రతిరోజూ ఓట్స్ తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

Published : Nov 24, 2026, 04:31 PM IST

Oats: ఓట్స్ ను సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటే ఎంతోంది. ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

PREV
13
ప్రతిరోజూ ఓట్స్ తింటే ఏమవుతుంది?

ఇప్పుడు ఎంతో మంది ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఓట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఓట్స్ ను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణక్రియ, ఆకలి వంటి అనేక విషయాలపై ప్రభావం చూపుతుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఓట్స్ తింటే మ శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి.

ఓట్స్ లో బీటా-గ్లూకాన్ తో పాటు శరీరానికి మేలు చేసే ఇతర ఫైబర్లు కూడా ఉంటాయి. ఓట్స్ ఒక సాధారణ ఆహారంగా అనిపించినప్పటికీ, ఇందులోని ఫైబర్ వల్ల ఇది సమతుల్య ఆహారంలో చేర్చదగిన ఉత్తమమైన ఆహారం. ఓట్స్ లో 'బీటా-గ్లూకాన్' (beta-glucan) అని పిలువబడే ఒక రకమైన కరిగే ఫైబర్ (soluble fibre) ఉంటుంది.

'చెడు కొలెస్ట్రాల్' గా పిలువబడే ఎల్.డి.ఎల్ (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఈ ఫైబర్ సహాయపడుతుంది. ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఆహారంలో ఓట్స్ ను చేర్చుకోవడం ద్వారా శరీరంలో కరిగే ఫైబర్ ను సులభంగా పెంచుకోవచ్చు.

23
రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్

ఓట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. ఓట్స్ లోని ఫైబర్ గ్లూకోజ్ శోషణ రేటును తగ్గిస్తుంది. గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి నెమ్మదిగా చేరడం వల్ల, తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని నిరోధించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిల గురించి జాగ్రత్త పడే వారికి ఓట్స్ లోని ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది.

ఓట్స్ లో ఉండే 'ప్రీబయోటిక్ ఫైబర్స్' (prebiotic fibres), పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడతాయి. రోజూ ఓట్స్ తినడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు అవసరమైన పోషకాలు ప్రీబయోటిక్ ఫైబర్స్ ద్వారా అందుతాయి. ఈ బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

33
బరువు తగ్గుతారా?

ఆకలిని నియంత్రించడంలో కూడా ఓట్స్ సహాయపడతాయి. ఓట్స్ తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇది పగటిపూట అనవసరంగా స్నాక్స్ తినడాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తే, పదే పదే ఆకలిగా ఉందనే భావనతో చిరుతిళ్లు తినే అలవాటును వదిలించుకోవచ్చు.

ఓట్స్ లోని ఫైబర్ మలవిసర్జనను క్రమబద్ధీకరించడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత ఫైబర్ తీసుకోవడం ముఖ్యం.

మన రోజువారీ ఫైబర్ అవసరాలను తీర్చడానికి ఓట్స్ సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజూ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచాలనుకునే వారికి ఓట్స్ ఎంతో మేలు చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories