కొబ్బరి చిప్పల హ్యాక్...
మీ ఇంట్లో కొబ్బరి తీసేసిన కొబ్బరి చిప్పలు ఉన్నా వాటితో కూడా మీరు మీ ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ కొబ్బరి చిప్పలను ఉంచి.. నీరు పోసి ఐస్ గడ్డ కట్టే వరకు ఉంచాలి. మొత్తం గడ్డ కట్టిన తర్వాత.. ఈ కొబ్బరి చిప్పలను టేబుల్ ఫ్యాన్ ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా రూమ్ మొత్తం చల్లగా మారుతుంది.
ఇతర సహాయక పద్ధతులు:
కాటన్ షీట్లు: నేల మీద కాటన్ షీట్స్ వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గదిలో వేడి తగ్గించడంలో సహాయపడుతుంది.
మట్టి కుండలో నీరు: గదిలో మట్టి కుండలో నీరు ఉంచడం వలన గది తేమగా ఉండి చల్లదనాన్ని కలుగజేస్తుంది.
ఖస్ షీట్లు, తెరలు: మార్కెట్లో ఖస్ షీట్లు ఈజీగా లభిస్తాయి. వీటిని మీరు కిటికీలకు, తలుపులకు ఖస్ షీట్లు, తెరలు వేయడం వలన బయట నుండీ వచ్చే వేడిని తగ్గించవచ్చు.