సిట్రస్
సాలె పురుగులకు సిట్రస్ వాసనలు నచ్చవు. కాబట్టి సిట్రస్ వాసన కలిగిన క్లీనర్లు, ఫర్నీచర్ పాలిష్‌లను ఉపయోగిస్తే ఇంట్లోకి సాలె పురుగులు రావు. మీ ఇంటి తోటలో సిట్రస్ మొక్కలను పెంచడం వల్ల ఈ సాలె పురుగులు శాశ్వతంగా ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
వెల్లుల్లి, లవంగాలు
ఘాటైన వెల్లుల్లి, లవంగాల వాసన వల్ల కీటకాలు వంటింట్లోకి రావు. రెండింటిని కలిపి బాగా గ్రైండ్ చేసి ఆ లిక్విడ్ ని నీటిలో కలిపి ఆ నీటిని మీ ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు, చెట్లపై చల్లాలి.