మీ ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

First Published Sep 10, 2022, 3:10 PM IST

రక్తహీనత ఏ వయసు వారికైనా రావొచ్చు. అయితే ఈ సమస్యను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు ఎంతో సహాయపడతాయి. 
 

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండే పరిస్థితినే రక్తహీనత అంటారు.ఈ రక్తహీనత ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అలసట ఈ సమస్య ప్రధాన లక్షణం. అలాగే ఒంట్లో శక్తి లేకపోవడం, ఏ పనీ చేయాలనిపించకపోవడం, మగత వంటివన్నీ రక్తహీనత ఉన్నవారిలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు.
 

ఈ రక్తహీనత బారిన ఏ వయసు వారైనా పడొచ్చు. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తింటే ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

leafy vegetables

ఆకు కూరలు

రక్తహీనత సమస్యను పోగొట్టడంలో ఆకు కూరలు ముందుంటాయి. ఎందుకంటే ఆకు కూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే బ్రోకలీ,  బచ్చలికూర, పాల కూర, తోటకూర వంటి ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఇవి రక్తహీనత సమస్యను పోగొడుతాయి. అంతేకాదు ఈ ఆకు కూరలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

బీన్స్

వేరు శెనగ, బీన్స్  వంటి చిక్కుళ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. మొలకెత్తిన గింజలను తిన్నా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి.

విటమిన్ సి

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా రక్తహీతన సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. నిమ్మకాయలు, ఉసిరికాయలు, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.
 

దానిమ్మ

దానిమ్మ పండులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడంలో ముందుంటాయి. దానిమ్మలో ఐరన్, కాల్షియం, ఫైబర్,  పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచి రక్తహీనతను నివారిస్తుంది.
 

dates

ఖర్జూరాలు

ఖర్జూరాలు కూడా రక్తహీనత సమస్యను పోగొడుతాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పోగొట్టే ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత సమస్యను ఫేస్ చేస్తున్న వారు వీటిని రోజూ తింటే మంచిది. 

బీట్ రూట్

బీట్ రూట్  ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషదంలా పనిచేస్తుంది. దీనిని జ్యూస్ గా చేసుకుని తాగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బీట్ రూట్ లో ఐరన్ కంటెంట్ మాత్రమే కాదు పొటాషియం, ఫోలిక్ యాసి్లు కూడా ఉంటాయి. అందుకే వీటిని మీ డైట్ లో భాగం చేసుకోండి. 
 

బొప్పాయి

బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. ఈ పండులో పోషకాలు, ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో ఇనుముతో పాటుగా విటమిన్ సి, పొటాషియం,  మెగ్నీషియం, ఫోలేట్ జింక్, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాకరకాయ లేదా బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు కాలేయం, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. 

click me!