పొరపాటున కూడా ఈ విషయాలు మీ భాగస్వామితో చెప్పకూడదు...!

First Published Sep 10, 2022, 2:32 PM IST

వారు అందంగా మీకు కనిపించినా.. ఈ విషయాన్ని వెంటనే వెళ్లి.. మీ భాగస్వామదికి చెప్పకూడదు. ఈ విషయాన్ని మీ పార్ట్ నర్ పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు.

దాంపత్య జీవితం సాఫీగా సాగాలి అంటే.. దంపతులు ఇద్దరూ కృషి చేయాలి. అందరూ దంపతుల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అని చెబుతుంటారు. కానీ.. నిజానికి  కొన్ని సీక్రెట్స్ ఉంటేనే మచిదట.  ప్రతి చిన్న విషయాన్ని మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉందట. దంపతులు విషయాలను పంచుకోవాలి.. కానీ.. కొన్ని సీక్రెట్స్ మాత్రం చెప్పకూడదట. ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఓసారి చూద్దాం... 
 

Image: Getty Images

ఆరోగ్యకరమైన సంబంధం అంటే మీరు మీ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం, ఇందులో మీ వ్యక్తిగత ఆలోచనలు ఇతర విషయాలు కూడా  ఉంటాయి అని గుర్తుంచుకోవాలి.
 

Image: Getty Images

ఒక వివాహ బంధంలో ఉన్నవారికి ఇతురులపై క్రష్ ఉండటం కొందరి విషయంలో జరగడం కామన్. అయితే... అది జస్ట్ క్రష్ మాత్రమే. మీకు ఆఫీసులో ఎవరైనా క్రష్ ఉన్నా.. వారు అందంగా మీకు కనిపించినా.. ఈ విషయాన్ని వెంటనే వెళ్లి.. మీ భాగస్వామదికి చెప్పకూడదు. ఈ విషయాన్ని మీ పార్ట్ నర్ పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు. కాబట్టి... ఇలాంటి విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది.

happy couple life


మీ భాగస్వామిని తొలిసారి చూడగానే అందరికీ ప్రేమ కలగకపోవచ్చు. కొంతకాలం వారితో కలిసి ట్రావెల్ చేయడం వల్ల మీకు వారిపై ప్రేమ కలగవచ్చు. అయితే.. మీకు పార్ట్ నర్ పై చూడగానే ప్రేమ కలగలేదు లాంటి విషయాలను మీ పార్ట్ నర్ తో పంచుకోకపోవడమే మంచిది. దీని వల్ల వారు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా చెప్పడం వల్ల వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది.

Image: Getty Images

చాలా మందికి పెళ్లికి ముందు ఇంకెవరినైనా ప్రేమించి ఉండొచ్చు. అయితే... కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. మీరు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అయితే.... మీకు ఇప్పటికీ మీ మాజీ పై ప్రేమ ఉన్నా... ఫీలింగ్స్ ఉన్నా... ఆ విషయాన్ని మీ పార్ట్ నర్ తో షేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. ఆ ఫీలింగ్స్ ని అక్కడే మర్చిపోయి.. మీ పార్ట్ నర్ తో సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. లేదంటే దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.

Image: Getty Images

మీరు ఎవరినైనా చూసినప్పుడు, మీరు మీ సన్నిహిత మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో మీ సంబంధంలోని కొన్ని భాగాలను-మంచి, చెడు గురించి చర్చించడం సర్వసాధారణం. అయితే, మీ భాగస్వామికి వారి అభిప్రాయాలు, వ్యాఖ్యలను పంచుకోవడం మానుకోండి. ఇది మీ భాగస్వామి, సదరు వ్యక్తి మధ్య విషయాలు ఇబ్బందికరంగా మారేలా చేస్తుంది. మీ మధ్య కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

click me!