ఈ సింపుల్ చిట్కాలతో చుండ్రుకు చెక్ పెట్టండి

First Published Sep 10, 2022, 2:11 PM IST

చుండ్రు ఒకరి నుంచి ఇంకొకళ్లకు వ్యాపిస్తుంది. అందుకే చుండ్రు సమస్యలను పేస్ చేస్తున్న వారు యూజ్ చేసిన దువ్వెన, టవల్ ను ఉపయోగించకపోవడమే మంచిది. 
 

ఈ రోజుల్లో చుండ్రు సమస్యను ఫేస్ చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ చుండ్రు హెయిర్ ఫాల్ కు కూడా దారితీస్తుంది. దీనివల్ల నెత్తిలో దురద పెడుతుంది. ముఖ్యంగా ఇది వీళ్లలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఈ చుండ్రు ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అయితే దీనికి కొంత జాగ్రత్త వహిస్తే చాలు చుండ్రును చాలా త్వరగా వదిలించుకోవచ్చు. చుండ్రు వదిలిపోవాలంటే మీ నెత్తిమీద దుమ్ము, దూళీ లేకుండా చూసుకోవాలి. మాడును సంరక్షించాలి. అప్పుడే చుండ్రును కొంతవరకు నివారించగలరు. అయితే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా కూడా చుండ్రును చాలా ఫాస్ట్ గా వదిలించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అరకప్పు పెరుగు  తీసుకుని అందులో టీ స్పూన్ నిమ్మరసం,  టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని జుట్టు మొదల్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేయండి. ఈ పద్దతిని వారానికికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించొచ్చు. మాడుకు పెరుగును మాత్రమే అప్లై చేసి గంట తర్వాత షాంపూతో కడిగేస్తే కూడా చుండ్రు వదిలిపోతుంది. పుల్లని పెరుగులో కొద్దిగా ఉప్పును వేసి నెత్తికి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేస్తే కూడా చుండ్రు పోతుంది. 

మెంతులు కూడా చుండ్రును వదిలిస్తాయి. ఇందుకోసం మెంతులను నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి. దాంట్లో గుడ్డులోని తెల్లసొను వేయిండి. దీనికి టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత జుట్టును నీట్ గా కడగండి. 
 

ఆలివ్ ఆయిల్, ఆముదం నూనెను సమపాళ్లలో తీసుకుని జుట్టుకు రాయండి. తరువాత వేడినీటిలో ముంచిన టవల్ తో మీ తలను బాగా కవర్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చుండ్రు వదిలిపోతుంది. 
 

ఒక గుడ్డులోని తెల్లసొనను తీసుకుని అందులో కప్పు పెరుగు వేసి అందులో రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టంతా పట్టించండి. 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో చల్లని నీళ్లతో తలను కడగండి. 
 

10 రాగి ఆకులు, ఒక టీస్పూన్ మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వీటిని పేస్ట్ లా చేసి అందులో అరకప్పు పెరుగును వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీదతో పాటుగా జుట్టు మొత్తాన్ని అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూతో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రును వదిలి జుట్టు బలంగా, పొడవుగా పెరుగుతుంది. 
  

click me!