Smartwatch: స్మార్ట్ వాచ్ ల వాడకం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. కానీ దీనిని వాడుతున్న కొద్దీ బ్యాండ్ దుమ్ము, ధూళి పట్టుకుని మురికిగా మారుతుంది. దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లనే వాడుతున్నారు. దీనిలో ఫోన్ల కాల్స్ చేసుకోవడం నుంచి వీడియోస్ చూడటం, హెల్త్ గురించి చెక్ చేసుకోవడం వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని వాడటానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఈ స్మార్ట్ వాచ్ లను వాడటం బాగానే ఉన్నా వీటి బ్యాండ్ కాలక్రమేణా నల్లగా, మురికిగా అవుతుంది. అసలు దీన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా తెలియదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో నల్లగా, మురికిగా మారిన స్మార్ట్ వాచ్ బ్యాండ్ ను సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
గోరువెచ్చని నీళ్లు, డిష్ సోప్
డిస్ సోప్ ను ఉపయోగించి స్మార్ట్ వాచ్ బ్యాండ్ ను ఈజీగా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం డిష్ సోప్ ను గోరువెచ్చని నీళ్లలో వేయాలి. దీంట్లో క్లాత్ ను ముంచి బ్యాండ్ పై రుద్ది క్లీన్ చేయాలి. ఇలా మురికి పోలేదంటే వాచ్ నుంచి బ్యాండ్ ను తీసేసి ఆ నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి టూత్ బ్రష్ తో క్లీన్ చేయొచ్చు. కానీ బ్యాండ్ ను ఎక్కువగా రుద్దకూడదు.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా కూడా బ్యాండ్ పై ఉన్న మురికిని, మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం టూత్ బ్రష్ పై లేదా స్ట్రాప్ పై బేకింగ్ సోడాను చల్లి క్లీన్ చేయొచ్చు. లేదా బేకింగ్ సోడా పేస్ట్ ను బ్యాండ్ కు కొద్ది సేపు ఉంచి తర్వాత క్లీన్ చేసినా నలుపు అంతా పోతుంది.
35
టూత్‌పేస్ట్
టూత్ పేస్ట్ కూడా వాచ్ పట్టీపై ఉన్న మరకలను, మురికిని తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం టూత్ పేస్ట్ ను బ్యాండ్ పై రాసి వేళితో వృత్తాకార కదలికలో రుద్దితే బ్యాండ్ క్లీన్ అవుతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్ ను ఉపయోగించి కూడా మీరు స్మార్ట్ వాచ్ బ్యాండ్ ను శుభ్రం చేయొచ్చు. వీటిలో బ్యాండ్ ను దెబ్బతీసే రసాయనాల ఉండవు. గనుక ఈ రెండింటినీ సమానంగా తీసుకుని పేస్ట్ చేయండి.దీన్ని బ్యాండ్ కు అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది.
55
మ్యాజిక్ ఎరేజర్
స్మార్ట్ వాచ్ బ్యాండ్ ను మీరు మ్యాజిక్ ఎరేజర్ తో కూడా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం వాచ్ నుంచి బ్యాండ్ ను వేరుచేయండి. అలాగే ఇది చర్మానికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది స్కిన్ ను చికాకు పెడుతుంది. దీన్ని క్లీన్ చేసని తర్వాత తుడిచి అప్పుడు చేతికి పెట్టుకోండి.