గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. అలాగే గుడ్డు కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు కూడా సహాయపడుతుంది.
గుడ్డులోకేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక గుడ్డులో 70 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మీ కడుపును తొందరగా నింపి ఎక్కువ తినకుండా చేస్తుంది.
గుడ్లలో విటమిన్ బి12, ఐరన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
గుడ్డును బ్రేక్ ఫాస్ట్ లో తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. కాబట్టి మీరు రోజూ ఉదయం ఒకటిరెండు గుడ్లను తింటే సులువుగా బరువు తగ్గుతారు.
నిపుణుల ప్రకారం.. గుడ్డును ఉడకబెట్టి తినడమే మంచిది. లేదంటే దీన్ని కూరగాయలతో కూడా తినొచ్చు.
కావాలనుకుంటే మీరు శాండ్ విచ్, సూప్ వంటి వాటితో కూడా గుడ్డును తినొచ్చు. కానీ నూనెను చాలా తక్కువగా వాడాలి.
15 నిమిషాల్లో ఇంట్లోనే చీజ్ ఎలా తయారు చేయాలో తెలుసా?
వీళ్లు పెరుగును అస్సలు తినొద్దు
డ్రై ఫ్ఱూట్స్ ను ఎంత సేపు నానబెడితే సరిపోతుంది
బాదం పప్పులను తొక్కతో తింటే ఇలా అవుతుంది