Rusted Iron Pan: ఐరన్ కడాయి తుప్పు పట్టిందా? రెండు నిమిషాల్లో మళ్లీ కొత్తదానిలా మర్చేయచ్చు..!

Published : May 27, 2026, 12:17 PM IST

 Rusted Iron Pan: మీ ఇంట్లో ఐరన్ పాన్ తుప్పు పట్టిందా? ఆ తప్పు వదిలించడం కష్టంగా ఉందా? అది శుభ్రం చేయలేక కడాయి పక్కన పడేశారా? అయితే.. సింపుల్ గా ఆ తప్పు వదిలించొచ్చు. 

PREV
13
Iron Pan

చాలా మంది ఇళ్లల్లో ఐరన్ పాన్ లు ఉంటూనే ఉంటాయి. అయితే.. దానిని సరిగా ఉపయోగించకపోయినా, వాడకుండా పక్కన పెట్టినా.. వెంటనే తుప్పు పట్టేస్తూ ఉంటాయి. ఒక్కసారి తుప్పు పడితే చాలు.. ఇక అవి పనికిరావు అని భావించి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ, రూపాయి ఖర్చు లేకుండా.. ఆ తప్పు వదిలించడమే కాకుండా, ఆ కడాయిని కొత్త దానిలా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

23
దీనితో శుభ్రం చేస్తే చాలు..

ఐరన్ పాన్ కి పట్టిన తుప్పు వదిలించడానికి చింతపండు, నిమ్మకాయ ఉంటే చాలు. దీని కోసం మీరు చింత పండు గుజ్జు తయారు చేసుకోవాలి. లేదంటే.. నిమ్మరసం వాడినా సరిపోతుంది. చింత పండు అయితే మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ముందుగా.. తుప్పు పట్టిన ఇనుప పాన్ ని కొద్దిగా నీటితో తడపాలి. ఆ తర్వాత చింత పండు గుజ్జు తుప్పు పట్టిన ప్రాంతాల్లో రుద్దాలి. దీనిలోని సహజ ఆమ్లతత్వం.. ఇనుముపై ఉన్న తుప్పు తొలగించడంలో సహాయపడుతుంది. తర్వాత దానిపై సైంధవ లవణాన్ని చల్లి, కొబ్బరి పీచు లేదా స్క్రబ్బర్ తో రుద్దాలి. అంతే.. కొన్ని నిమిషాల్లో తుప్పు నెమ్మదిగా పోయి.. పెనం అసలు రంగులోకి వచ్చేస్తుంది. కొత్త దానిలా కనపడుతుంది.

తుప్పు మరీ ఎక్కువగా ఉంటే, చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం పూసి.. రుద్దే ముందు 10 నుంచి 15 నిమిషాలపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత రుద్దితే.. తుప్పు ఈజీగా వదులుతుంది. రసాయన క్లీనర్లను ఉపయోగించకుండా సహజంగా శుభ్రపరచవచ్చు. అప్పుడు.. ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని జరగదు.

తుప్పు పూర్తిగా తొలగిపోయిన తర్వాత, ఐరన్ పాన్ ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత, వెంటనే పొడి క్లాత్ తో తుడిచి, తేమ తగలకుండా చూసుకోవాలి. ఎక్కువ తడి ఉంటే.. మళ్లీ తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత.. పాత్రను పొయ్యి మీద పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలపాటు మెల్లగా వేడి చేయాలి. దీని వల్ల లోపల ఏదైనా తేమ ఉంటే.. పూర్తిగా ఆరిపోతుంది. ఆ తర్వాత.. ఐరన్ కడాయి లోపల నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల మరోసారి తుప్పు పట్టకుండా ఉంటుంది.

33
ఐరన్ కడాయి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఐరన్ పాత్రలను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాత్రను కడిగిన వెంటనే పొడిగా తుడవాలి. దానిని ఎక్కువ సేపు నీటిలో నానపెట్టకూడదు. అలాగే, దానికి తరచుగా నూనె రాసి వాడితే.. ఐరన్ పాత్రల మన్నిక మరింత పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories