అలాగే అధిక బరువు మీ ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. రోజుకు సరిపడే 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. నిద్రలేమి సమస్య కూడా మన ఇమ్యూనిటీని క్షీణింపజేస్తుంది. ఇక పోతే మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది తాగడం వల్ల body లోని కాలెయం, మూత్రపిండాలు, గుండె పనితీరును, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అందుకే సుక్కకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే Stress కు ఎంత దూరంగా ఉంటే మీరు మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే మన శరీరంలో జింక్, ఐరన్, సెలీనియం, విటమిన్లు, ఎ, బి, సి, డి, ఇ లు, ప్రోటీన్లు, ఖనిజాలు సరిపడా ఉండాలని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు.