కావాల్సిన పదార్థాలు: బెల్లం పావుకిలో, బియ్యం(రేషన్ బియ్యం) పావుకిలో, పావుకిలో చక్కెర, రెండు చిన్న స్పూన్ల నువ్వులు, నూనె, నెయ్యి తీసుకోవాలి.
తయారు చేసే పద్దతి: బియ్యాన్నినీట్ గా కడిగి ఒక రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక దాన్ని రోట్లో వేసుకుని పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి.. స్టవ్ వెళిగించి దట్టంగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని అందులో పంచదార, బెల్లం వెయ్యాలి. ఈ రెండు మునిగేలా అందులో Water పోసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో నెయ్యి వెయ్యాలి. ఆ మిశ్రమాన్ని నిదానంగా చెంచాతో తిప్పుకోవాలి. అయితే ఈ పాకం అరిసెలు చేసుకోవడానికి అనువుగా తయారయ్యిందని నిర్దారించుకోవాలంటే.. మరుగుతున్న పాకంలోంచి కొంచెం తీసుకుని కొంచెం పిండిలో పొయ్యాలి. ఆ పిండిని ఉండలుగా కట్టండి. ఆ ఉండలు Smooth గా వస్తే పాకం సిద్దమైందని అర్థం. అదే ఉండలు రఫ్ గా వస్తే మాత్రం ఇంకా పాకం సిద్దం కాలేదని అర్థం. అయితే ఈ పాకం గట్టిగా మారే వరకు ఉంచకూడదు.