young looking tips: ఇలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం..

First Published Jan 14, 2022, 1:04 PM IST

young looking tips: ఏ  Age అయినా కానీయండి.. ముఖం మాత్రం యంగ్ గా కనిపించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వయస్సు మీద పడుతున్న కొద్ది యంగ్ లుక్ మాయమవుతూ ఉంటుంది. అలా అస్సలు కనిపించకూడదని చాలా మంది ఆశిస్తుంటారు. యవ్వనంగా, అందంగా కనిపించాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే సరి.

young looking tips: వయస్సు మీద పడుతున్నకొద్దీ వెంట్రుకలు తెల్లగా అయిపోవడం, ముఖం పై ముడతలు రావడం సహజంగా జరిగే ప్రాసెస్. కానీ చాలా మంది అలా కనిపించకూడదని భావిస్తుంటారు. అందుకే వెంట్రుకలు పూర్తిగా తెల్లగా మారకముందే కలర్స్ వేస్తుంటారు. ఇక ముఖం Young look గా కనిపించాలని చాలా కష్టపడిపోతారు. కానీ ఫలితం రాక నిరాశ చెందిన వారు లేకపోలేదు. అయితే ఇలా ముఖం యవ్వనంగా కనిపించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. మీ ముఖంపై ఏర్పడిన ముడతలను, మచ్చలను వదిలించుకుని అందంగా, యవ్వనంగా కనిపించొచ్చు. అందుకు కోసం మసాజ్ లు చేయడం, Face pack లు వేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ క్రింద తెలిపిన టిప్స్ ను ఫాలో అయ్యి మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి. 

మీ ముఖం మొత్తాన్ని మసాజ్ చేయండి. వలయాకారంగా, పై నుంచి కిందికి మసాజ్ చేయడం వల్ల ముఖంపై వచ్చే  Changes ను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా మసాజ్ చేయడంతో మీ ముఖంలో Glow వచ్చి అందంగా మారిపోతుంది. ఎందుకంటే మసాజ్ చేయడంతో చర్మంపై రక్తప్రసరన మంచిగా జరుగుతుంది. దాంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే వయసు వారిగా వచ్చే ముడతల సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా మసాజ్ చేయడంతో ముఖంపై ఉండే మలినాలు పూర్తిగా తొలగిపోయి.. పింపుల్స్ బారినుంచి ఈజీగా తప్పించుకుంటారు. ఇదే కాకుండా మెల్లిగా Scrubbing చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖంపై ఉండే జిడ్డును, నల్ల మచ్చలు మటు మాయం అవుతాయి. 

ముఖంపై Pimplesఉంటే ఆరెంజ్ ప్యాక్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. దానికోసం.. టీ స్పూన్ పుదీనా ఆకులు, కొంచెం Lemon juice, ఒక ఆరెంజ్ ను తీసుకుని వీటన్నింటిని గ్రైండ్ లో వేసుకుని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లని నీళ్లతో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ లో విటమిన్ సి, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అవి ముఖంపై ఉండే మొటిమలను దూరం చేస్తాయి. అయితే చర్మం జిడ్డుగా ఉన్నవారికే మొటిమల సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. 


అందుకే వీళ్లు ఎక్కువగా సిట్రస్ ఫేస్ ప్యాక్స్ ను వాడుతూ  ఉంటే మంచి ఫలితం పొందవచ్చు. టీనేజర్లలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఫేస్ ను నీట్ గా ఉంచడానికి ప్రయత్నించాలి. సాధారణ చర్మం ఉన్న వారు తేనే కాంబినేషన్స్ ఉండే ప్యాక్స్ ను ప్రయత్నించండి. పొడి చర్మం ఉన్న వాళ్లు మాయిశ్చరైజర్ క్రీములను వాడటం ఉత్తమం. కలబంద గుజ్జు, ముల్తానా మట్టి, శనగపిండితో ముఖం మరింత అందంగా మారుతుంది. అయితే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ skin కి పడే ప్యాక్స్ ను మాత్రమే ఉపయోగించాలి.

ఇకపోతే ఆపిల్ కూడా ముఖంపై ముడతలు లేకుండా చేస్తుంది. ఆపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసం గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ లో కొంచెం Honey వేసి ఒక 10నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత దాన్ని ముఖంపై రాసుకోవాలి. తర్వాత కొంచె సేపు మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడగాలి. ఈ ప్యాక్ లో విటమిన్ ఎ,బి, సి లు పుష్కలంగా లభించడంతో ఫేస్ నిగనిగ మెరిపోవడంతో పాటుగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 

click me!