Chickpeas: శనగలు రాళ్లలా ఉంటాయి. వీటిని ఉడికించానికి కనీసం ఐదు గంటలు నానపెట్టాలి.. తర్వాత కూడా ప్రెజర్ కుక్కర్ లో పెడితేనే అవి ఉడుకుతాయి. అయితే, సింపుల్ చిట్కాలతో.. ప్రెజర్ కుక్కర్ లేకపోయినా వీటిని ఉడికించొచ్చు.
వంటింట్లో ప్రెజర్ కుక్కర్ ఒక్కటి ఉంటే చాలు.. ఎన్నో రకాల పనులు నిమిషాల్లో జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక్కోసారి కుక్కర్ మొరాయించా, లేదా అసలు కుక్కర్ అందుబాటులో లేకపోయినా చాలా రకాల వంటలు చేయడం కష్టం అయిపోతుంది. ముఖ్యంగా శనగలు లాంటివి ఉడికించాలి అంటే.. ప్రెజర్ కుక్కర్ ఉండాల్సిందే. కానీ, కుక్కర్ లేకపోయినా.. ఈ శనగలను చాలా సింపుల్ గా నిమిషాల్లో ఉడికించొచ్చు. అదెలాగో.. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం...
23
మైక్రో ఓవెన్ ఉంటే చాలు....
శనగలు త్వరగా ఉడకాలి అంటే... మైక్రోవేవ్ ఒక్కటి ఉంటే చాలు. దీనిలో చాలా వేగంగా శనగలు ఉడుకుతాయి. కుక్కర్ లో ఎంత వేగంగా ఉడుకుతాయో.. ఓవెన్ లో కూడా అంతే తొందరగా ఉడుకుతాయి.
స్టవ్ మీద ఉడికించాలి అంటే...
స్టవ్ మీద శనగలను తొందరగా ఉడికించాలి అంటే... అల్యూమినియం ఫాయిల్ వాడితే సరిపోతుంది. ముందుగా.. ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో శనగలు వేయాలి. ఇప్పుడు దానిని స్టవ్ మీద పెట్టి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత.. పాత్ర పై భాగాన్ని అల్లూమినియం ఫాయిల్ షీట్ ని గట్టిగా కప్పి, ఆపై మూత పెట్టాలి. ఇది ఆవిరిని లోపలే బంధించి, ప్రెజర్ కుక్కర్లాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది.
33
స్టీమర్ వాడితే చాలు..
ఇక స్టీమర్ కూడా శనగలను ఉడికించడానికి ఉపయోగపడుతుంది. ప్రెజర్ కుక్కర్ అంత హై-ప్రెజర్ ఆవిరి రాకపోయినా, స్టీమర్లో వచ్చే ఆవిరి శనగలను ఉడికించొచ్చు. కాస్త ఎక్కువ సమయం పట్టినా.. మెత్తగానే ఉడుకుతాయి. ఇలా ఆవిరిపై ఉడికించిన తర్వాత, మీకు నచ్చిన గ్రేవీలో వాటిని సులభంగా కలుపుకోవచ్చు.
శనగలను ఉడికించేటప్పుడు లేదా ఆవిరిపై పెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్ వేస్తే అవి తొందరగా ఉడుకుతాయి. ప్రెజర్ కుక్కర్ వాడటంలో ఇంకా పూర్తిగా పట్టు సాధించని వారు లేదా కుక్కర్ లేని సమయంలో వంట చేయాలనుకునే వారు ఈ సింపుల్ టిప్స్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వంటను పూర్తి చేయవచ్చు.