over thinking: ఓవర్ థింకింగ్ ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?

Published : May 12, 2022, 02:11 PM IST

over thinking: ఈ గజిబిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో భాదపడుతుంటారు. సవాలక్ష విషయాల గురించి ఒక్కటే ఆలోచిస్తుంటారు. కానీ అతిగా ఆలోచించడం వల్ల మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.   

PREV
18
over thinking: ఓవర్ థింకింగ్ ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
over thinking

over thinking: ఓవర్ థింకింగ్ మన హెల్త్ కు ఏ మాత్రం మంచిది కాదు. ఓవర్ గా ఆలోచిస్తే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అతి ఆలోచన వల్ల ఎలాంటి సమస్యలొస్తాయంటే.. 

28

బీపీ.. ఓవర్ గా ఆలోచించే వారు పక్కాగా అధిక రక్తపోటు సమస్య బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం వల్ల ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో రక్తపోటు కూడా పెరుగుతుంది. మీ ఆలోచనలు మితిమీరితే డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యల బారిన పడక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

38

నిద్రలేమి.. ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య బారీగా పెరిగింది. ఈ నిద్రలేమికి దారితీసే ప్రధాన కారణాల్లో ఓవర్ థింకింగ్ ఒకటి. అతి ఆలోచనలు కంటికి నిద్రను దూరం చేస్తాయి. ఈ సమస్య ఆఖరికి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. 

 

48

హార్ట్ స్ట్రోక్.. ప్రస్తుతం యువత సైతం హార్ట్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. దీనికి గల కారణాల్లో ఓవర్ థింకింగ్ ఒకటి. ఎందుకంటే అతిగా ఆలోచించడం వల్ల స్ట్రోక్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడికి, రక్తపోటుకు, హార్ట్ ఎటాక్ కు దగ్గరి సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

58

ఆకలి తగ్గుతుంది.. అంతులేని ఆలోచనలు మీకు తిండి, నిద్ర లేకుండా చేస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల దాహం, ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే తినాలి అన్న సెన్సేషన్స్ మీ బ్రెయిన్ కు లేట్ గా చేరుతాయి. దీంతో మీరు గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్యలు, ఒబెసిటీ వంటి హెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయి. 
 

68
over thinking

ఇమ్యూనిటీ.. అతిగా ఆలోచించడం వల్ల కేవలం ఆకలికాకపోవడం, దాహం వేయకపోవడమే కాదు మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఎందుకంటే అతిగా ఆలోచించి మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో మీ శరీరంలో కార్డిసాల్ హార్మోన్ ఉత్పతి అవుతుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తుంది. 

78

మీ అతి ఆలోచనలకు బ్రేక్ పడాలంటే దేని గురించి ఆలోచిస్తున్నారో.. వాటిని డైరీలో రాసుకోండి. లేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో చెప్పుకోండి. జరిగిపోయిన విషయాలను మార్చడం ఎవరి వల్లా కాదు. కాబట్టి గతం గురించి మర్చిపోయి ప్రెజెంట్ లో జీవించండి. 

88

మెడిటేషన్.. మెడిటేషన్ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాదు ఇది అతి ఆలోచనల నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది. ఇందుకు మీరు ప్రతిరోజూ యోగా, ధ్యానం లాంటివి చేస్తూ ఉండండి. 

Read more Photos on
click me!

Recommended Stories