health tips: ఈ పండ్లను రాత్రిపూట ఎట్టి పరిస్థితిలో తినకండి.. లేదంటే మీ పని అంతే..!

Published : May 12, 2022, 01:09 PM IST

health tips: పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని పండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీకు ఈ సమస్యలు రావడం పక్కా అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
15
health tips: ఈ పండ్లను రాత్రిపూట ఎట్టి పరిస్థితిలో తినకండి.. లేదంటే మీ పని అంతే..!

health tips: పిల్లలకైనా, పెద్దవారికైనా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ పండ్లను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పండ్లను సమయం సందర్భాన్ని బట్టి తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

25

35

అరటిపండు.. అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పండును రాత్రిపూట మాత్రం అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది వ్యాయామం తర్వాత లేదా సాయంత్రం పూట అరటి పండ్లను తింటుంటారు.  కానీ ఈ పండును జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ సలాడ్ గా రాత్రిపూట తీసుకోకూడదు. రాత్రిపూట అరటి పండ్లను తింటే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మీరు నిద్రపోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రాత్రిపూట అరటిపండ్లను అస్సలు తినకూడదు. 

45

ఆపిల్.. రోజూ ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆపిల్ పండు ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. కానీ వీటిని రాత్రిపూట మాత్రం తినకూడదు. రాత్రి సమయంలో యాపిల్ పండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. యాపిల్ పండ్లలో రక్తంలో షుగర్ ను నియంత్రించే ఫైబర్ ఉంటుంది. అంతేకాదు రాత్రి సమయంలో ఆపిల్ పండ్లను తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వీటిలో ఉండే ఫైబర్ కారణంగా తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. 
 
55

సపోటా.. రాత్రిపూట సపోటాలను ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని రాత్రిపూట తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో మీరు రాత్రుళ్లు సరిగ్గా నిద్రకూడా పోలేరు. అందుకే రాత్రిపూట సపోటాలను అస్సలు తినకండి.  
 
click me!

Recommended Stories