Hygiene : మీరు రోజూ వాడే ఈ వస్తువులను క్లీన్ చేయలేదో జబ్బులొస్తాయ్ జాగ్రత్త

Published : Sep 13, 2025, 06:23 PM IST

Hygiene :మనం కొన్ని రకాల వస్తువలను ప్రతిరోజూ వాడుతుంటాం. ఇలాంటి వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీటివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే మనం రోజూ వాడే ఏయే వస్తువులను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేసుకోవాలంటే

PREV
16
ఆరోగ్య చిట్కాలు

మనం ఆరోగ్యంగా ఉండటానికి ఫుడ్ ఎంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలి. అయితే మనం రోజూ వాడే కొన్ని వస్తువులను ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ మనన్ వోరా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వివరించారు. లోదుస్తుల నుంచి దుప్పట్ల వరకు ఏ వస్తువులను, ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాలో ఈయన వీడియోలో చెప్పారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

26
శుభ్రత

వీటిని శుభ్రం చేయకపోతే మనకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. మనం రోజూ ఉపయోగించే పరుపు, దిండ్లు, దిండ్ల కవర్లు, జీన్స్, టూత్ బ్రష్లు వీటిలో ఉన్నాయి. వీటిలో మనం రోజూ వాడే లోదుస్తులను వాడిన వెంటనే శుభ్రం చేయాలి. వీటిని రోజూ క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే వీటిని వాడిన తర్వాత ఖచ్చితంగా ఉతకాలి. 

36
టూత్ బ్రష్

టూత్ బ్రష్ లను మనం రోజూ వాడుతాం. కాబట్టి వీటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఫంగస్, బ్యాక్టీరియా వల్ల చిగుళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడతాం. కాబట్టి వీటిని వాడిన తర్వాత ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అలాగే మూడు నెలలకోసారి టూత్ బ్రష్ ను ఖచ్చితంగా మార్చాలి. టూత్ బ్రష్ తేమగా ఉంటే వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి వీటిని పొడిగా ఉంచుకోవాలి. 

ఇకపోతే దిండు కవర్లను ఖచ్చితంగా మూడు నాలుగురోజులకోసారి శుభ్రంగా ఉతకాలి. అలాగే మీకు మొటిమలు ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా దిండు కవర్లను తరచుగా మారుస్తూ ఉండాలి. 

46
దిండ్లు

చాలా మంది దిండ్లను అస్సలు శుభ్రం చేయరు. ఎప్పుడో ఒకసారి ఉతుకుతుంటారు. కానీ వీటిని ఆరెనెలలకోసారి ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే వీటికి చెమట, దుమ్ము, ధూళిపట్టుకుంటాయి. దీంతో అవి మురికిగా అవుతాయి. వీటిని ఉతకకుండా అలాగే వాడితే జుట్టు రాలుతుంది. ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఆరునెలలకోసారి దిండ్లను శుభ్రం మన్నా చేయాలి. లేదా మార్చాలి. అలాగే పరుపులను కూడా రెండుమూడు నెలలకోసారి మర్చిపోకుండా ఉతకాలి. అలాగే జీన్స్ ను కూడా నాలుగైదు సార్లు వాడిన తర్వాత  ఖచ్చితంగా ఉతికే వేసుకోవాలి. 

56
టవల్

స్నానం చేసినప్పుడు, ముఖం కడిగినప్పుడు ఖచ్చితంగా టవల్ ను వాడుతాం. కానీ టవల్ ను శుభ్రం చేయకుండా వాడితే వాటికి క్రిమి కీటకాలు అంటుకుంటాయి. అందుకే టవల్ ను ఖచ్చితంగా రెండు మూడు రోజులకోసారి ఉతకాలి. ఎండలో ఆరబెట్టాలి.6 నెలలకోసారి టవల్ ను ఖచ్చితంగా మార్చాలి. 

అలాగే మనం రోజూ వాడే ఫోన్లకు మురికి, ఫంగస్ లు అంటుకుంటాయి. ఇవి మన చేతులకు అంటుకుని చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఫోన్ ను ప్రతిరోజూ ఆల్కహాల్ ఉన్న క్రిమిసంహారక వైప్స్ లేదా మైక్రో ఫైబర్ క్లాత్ తో శుభ్రం చేయాలి. అలాగే టాయిలెట్, బాత్ రూంకి ఫోన్ ను తీసుకెళ్లొద్దు. 

66
బాటిల్స్

అలాగే కిచెన్ లో వాడే స్పాంజ్ ను కూడా నెల నెలా మార్చాలి. ఎందుకంటే ఇవి ఎప్పుడూ తడిగా ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ లు వాటిలో పెరుగుతాయి. దీనివల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతాం. అందుకే వీటిని రోజూ వాడిన తర్వాత వేడి నీటిలో శుభ్రంగా కడిగేసి ఎండలోొ ఆరబెట్టాలి.  వీటిని ప్రతి నెలా మార్చాలి. 

అలాగే మనం ఉపయోగించే వాటర్ బాటిల్స్, గ్లాసులను క్లీన్ గా ఉంచుకోకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిలోని నీళ్లను తాగడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు వస్తాయి. స్టీల్ బాటిలో ను వేడినీళ్లు, సబ్బుతో శుభ్రం చేయాలి. ప్లాస్టిక్ బాటిల్ ను లోపల బ్రష్ తో శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి బేకింగ్ సోడా, వెనిగర్ తో క్లీన్ చేయాలి. 

Read more Photos on
click me!

Recommended Stories