Chanakya Niti: భర్తకు భార్య పొరపాటున కూడా చెప్పకూడని విషయాలు ఇవి..!

Published : Sep 13, 2025, 03:24 PM IST

Chanakya Niti:  చాణక్య నీతి ప్రకారం,  పెళ్లి తర్వాత అమ్మాయిలు తమ జీవితాన్ని తెరిచిన పుస్తకంలా ఉంచకూడదు. కచ్చితంగా కొన్ని విషయాలను మనసులోనే దాచుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, ఆ విషయాలేంటో చూద్దాం..

PREV
14
Chanakya Niti

చాణక్యుడు గొప్ప ఆర్థిక వేత్త. ఆయన కేవలం ఆర్థిక పాఠాలు మాత్రమే కాదు.. మానవ జీవితానికి సంబంధించిన చాలా విషయాలను కూడా తన చాణక్య నీతిలో వివరించారు. ఆయన రాసిన చాణక్య నీతిని ఫాలో అయితే.. జీవితంలో అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. సంపద, స్నేహం, వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ఇందులో పొందుపరిచారు. మరి, చాణక్యుడి ప్రకారం.. భార్య.. భర్తకు చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. మరి, అవేంటో చూద్దామా.....

24
తల్లిదండ్రుల రహస్యాలు...

చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత.. తమ భర్తే జీవితం గా జీవిస్తారు. పెళ్లైన మొదట్లో అతి ప్రేమతో తమ పేరెంట్స్ గురించి అన్ని విషయాలను చెప్పేస్తూ ఉంటారు. తమ పుట్టింటి గురించీ, ముఖ్యంగా తమ పేరెంట్స్ గురించి తమ భర్తకు అన్నీ చెప్పేస్తూ ఉంటారు. కానీ, చాణక్య నీతి ప్రకారం.. ఆ తప్పు మాత్రం అస్సలు చేయకూడదట. ఎందుకంటే.. దంపతుల మధ్య గొడవలు జరిగితే... మీరు చెప్పిన విషయాలు మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి.. పొరపాటున కూడా సీక్రెట్స్ చెప్పకుండా ఉండటమే మంచిది.

34
అబద్ధాలు చెప్పడం...

భార్యాభర్తల మధ్య సంబంధానికి పునాది నమ్మకం అని చాణక్యుడు చెప్పాడు. భార్య అబద్ధం చెప్పి నిజం బయటపడితే, సంబంధం ఖచ్చితంగా తెగిపోతుంది. ఒకసారి అబద్ధం చెబితే, ఆ సంబంధం పునాది కదిలిపోతుంది.దానిని మళ్ళీ బలోపేతం చేయడం కష్టం. కాబట్టి.. అబద్ధాలు చెప్పకూడదు.

మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి.

మీ భర్తను వేరే ఏ పురుషుడితోనూ పోల్చకండి. అది స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు కావచ్చు. అలా చేయడం వల్ల భర్త అహం దెబ్బతింటుంది.

అతని ఆత్మ గౌరవం కూడా దెబ్బ తింటుంది. అందుకే.. అలాంటి తప్పు చేయకూడదు. దంపతుల మధ్య దూరం పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి.. భర్తను మరొకరితో పోల్చకూడదు.

44
విరాళాలు,పొదుపులకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచండి.

చాణక్య నీతి ప్రకారం, భార్య తన విరాళాలు ,వ్యక్తిగత పొదుపుల గురించి తన భర్తకు ప్రతిదీ చెప్పకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో వివాదాలు,ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు.

కోపంలో కఠినమైన మాటలు మాట్లాడకండి.

ప్రతి సంబంధం ఒడిదుడుకుల గుండా వెళుతుంది, కానీ కోపంలో భర్తతో కఠినమైన మాటలు మాట్లాడటం విడిపోవడానికి దారితీస్తుంది. చాణక్య ప్రకారం, కోపంలో మాట్లాడే మాటలు బాణం లాంటివి. అవి గాయాలను కలిగిస్తాయి. చాణక్య నీతి రాజకీయాలు ,డబ్బు నిర్వహణకు మాత్రమే పరిమితం కాదు, కానీ మానవ జీవితం ,వైవాహిక సంబంధాల గురించి ఆయన లోతైన బోధనలు ఇచ్చారు. భార్య ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, వైవాహిక జీవితం సంతోషంగా ,బలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories