Cooking Oil Usage: నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి?

Published : Jan 22, 2026, 12:23 PM IST

Cooking Oil Usage: కూరలు, బిర్యానీలు, స్వీట్లు ఏది వండాలన్నా నూనె ఎంతో అవసరం. అయితే నూనె అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నలుగురున్న కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలో వైద్యులు వివరిస్తున్నారు. 

PREV
14
నూనె ఎంత వాడాలి?

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న రోజులు ఇవి. వైద్యుల నుంచి ప్రభుత్వం వరకు అందరూ నూనెను తగ్గించమని సిఫారసు చేస్తున్నారు. కూరలు, బిర్యానీలు, స్వీట్లు ఇలా ఏది వండినా కూడా అందులో నూనె పడాల్సిందే. అయితే అవసరానికి మించి నూనె వాడడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెపైన నూనె ప్రభావం అధికంగా ఉంటుంది. రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యమే చెడిపోతుంది. కాబట్టి వైద్యులు నలుగురు ఉన్న కుటుంబంలో నెలకు ఎంత నూనె వాడాలో వివరిస్తున్నారు. ఆ పరిమితికి మించి వాడకపోవడమే ఉత్తమం.

24
నూనె వాడితే వచ్చే సమస్యలు

వైద్యులు చెబుతున్న ప్రకారం తినే ఆహారంలో నూనె ఎంతో కొంత అవసరమే. అది అధికంగా మాత్రం ఉండకూడదు. ఒక వ్యక్తి నెలకు సుమారు అర లీటరు నూనెను మాత్రమే వాడాలి. అంటే రోజుకు రెండు నుంచి మూడు స్పూన్లకు మించి వాడకూడదు. ఈ మేరకు నలుగురు ఉన్న కుటుంబం నెలకు సుమారు రెండు లీటర్ల నూనెను మాత్రమే వాడితే సరిపోతుంది. చాలా కుటుంబాలు అవసరానికి మించి కొనుగోలు చేసి ఎక్కువగా వాడేస్తున్నారు. ఇలా వాడడం వల్ల తమకు తెలియకుండానే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నూనె అధికంగా వాడడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

34
ఇలాంటి ఆహారాలు వద్దు

కొంతమందికి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి డీప్ ఫ్రై వంటకాలు తినే అలవాటు ఉంటే వెంటనే వదిలేయండి. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, షుగర్ వ్యాధి, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు నూనె వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సన్ ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, నెయ్యి ఇలా ఏదైనా సరే పరిమితి దాటితే ఆరోగ్యానికి హానే చేస్తుంది తప్ప ఎలాంటి మేలు చేయదు. ఆరోగ్యంగా జీవించాలంటే మేము నూనె, నెయ్యిని పూర్తిగా మానేయాలని చెప్పడం లేదు. కానీ అవసరమైనంత మేరకే వాడాలని చెబుతున్నాము.

44
రెండు లీటర్లు చాలు

నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు రెండు లీటర్లకు మించి నూనెను కొనకపోవడమే మంచిది. ఆ రెండు లీటర్ల నూనె మాత్రమే వాడాలని టార్గెట్ గా పెట్టుకోవాలి. అంతకుమించి వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంట్లో వంట చేసే విధానంలో కూడా మార్పులు చేసుకుంటే నూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఉడకబెట్టిన వంటకాలు, ఆవిరి మీద వండే ఆహారము, తక్కువ నూనెతో చేసే కూరలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories