ఈ అలవాట్లు మార్చుకోకుంటే.. మీ సెక్స్ లైఫ్ ముగిసినట్లే..!

First Published | Jan 24, 2022, 2:57 PM IST

 మనకు తెలీకుండానే.. మన కొన్ని అలవాట్లు.. మన శృంగార జీవితాన్ని నాశనం చేస్తాయి . మరి ఏ అలవాట్లకు దూరంగా ఉంటే.. సెక్స్ లైఫ్ ఆనందంగా ఉంటుందో ఓసారిచూసేద్దామా..
 

sex-secrets

ప్రతి ఒక్కరూ లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అయితే.. ఇలా ఆనందంగా శృంగార జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. మనం ఆరోగ్యంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలీకుండానే.. మన కొన్ని అలవాట్లు.. మన శృంగార జీవితాన్ని నాశనం చేస్తాయి . మరి ఏ అలవాట్లకు దూరంగా ఉంటే.. సెక్స్ లైఫ్ ఆనందంగా ఉంటుందో ఓసారిచూసేద్దామా..
 

1.కాఫీ..

విపరీతంగా కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో.. సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుందట. ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావు కానీ...  అదే పనిగా కాఫీలు తాగితే మాత్రం.. సెక్స్ డ్రైవ్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందట. మీరు దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు, మీ అడ్రినల్ గ్రంథులు ఎక్కువగా పని చేస్తాయి, మీ లైంగిక పనితీరును నిరోధించే ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తాయి. కాబట్టి.. ఎక్కువగా కాఫీ తాగడం మానేయడమే మంచిది.
 


2.మిమ్మల్ని మీరు తక్కువగా చేసకోవడం..

చాలా మంది ప్రతి విషయాల్లో తమను తాము డీగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. అలా ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం వల్ల .. మీలొ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల.. సెక్స్ లైఫ్ సమస్యల్లో పడుతుంది.
 

3.సువాసన..
సెక్స  జీవితంలో.. వాసన కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మంచి వాసన వస్తే.. పార్ట్ నర్ మీ దగ్గరకు వస్తారు. అలా కాకుండా.. మీ దగ్గర  ఎక్కువగా చెమట వాసన, లేదా చివరగా మీరు తిన్న ఆహారం వాసన లాంటివి వస్తే మాత్రం.. మీ పార్ట్ నర్ మిమ్మల్ని దూరం పెట్టే అకవాశం ఎక్కువగా ఉంటుంది.
 

sleep

4.నిద్ర..
నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.  తక్కువ నిద్ర.. అనేక సమస్యలకు కారణమౌతుంది. అందులో సెక్స్ కూడా ఉంటుంది. తక్కువ నిద్ర , తక్కువ విశ్రాంతి తక్కువ సెక్స్ డ్రైవ్‌కు దారితీస్తుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, “అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ఉన్న ఊబకాయం లేని పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను అనుభవిస్తారు. ఇది లైంగిక కార్యకలాపాలను తగ్గిస్తుంది. మీ మనస్సు ప్రతికూల ఆలోచనలలో నిమగ్నమై ఉన్నందున ఒత్తిడి కారణంగా నిద్రలేమి కూడా మీ లిబిడోను తగ్గిస్తుంది. ఇది లైంగిక అసమర్థతకు దారితీస్తుంది

5. పరిశుభ్రత..

మన బెడ్, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా.. డర్టీగా ఉంటే.. అవి కూడా.. మీ సెక్స్ లైఫ్ ని ప్రభావితం చేస్తాయి.  మీ ఇల్లు, పడక గది, బెడ్ షీట్, దిండు అన్నీ దుమ్ముతో.. మురిగా ఉంటే కూడా సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు.
 

6.చెక్కర..
ఎక్కువ చక్కెరను తీసుకోవడం వల్ల కూడా.. సెక్స్ లైఫ్ కి దూరమౌతారు.  సోడాలు, ఆహారం, కాఫీ, చక్కెర మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది, ఇవి పొట్ట దగ్గర కొవ్వును నిల్వ చేస్తుంది,  పురుషులలో, చక్కెర వారి ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది, ఇది అంగస్తంభనకు దారితీస్తుంది.

Latest Videos

click me!