Benefits Of Onion Juice: వావ్.. ఉల్లిరసంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

First Published Jan 24, 2022, 2:19 PM IST

Benefits Of Onion Juice: భారతీయ వంటకాల్లో ఉల్లిగడ్డ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకంటే ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు మరి. అందుకే ఉల్లి మనకు ఏయే విధంగా మేలు చేస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Benefits Of Onion Juice: ప్రతి వంట గదిలో పక్కాగా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. ఉల్లిగడ్డ లేకపోతే కూర ఎలా చేయాలి అనే వారు కూడా లేకపోలేరు.  అందులోనూ ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఉల్లిని ప్రతి వంటకంలో వాడుతుంటాం. ఒకరకంగా చెప్పాలంటే మన ఆరోగ్యానికి ఉల్లి సంజీవనిలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఉల్లిరసం అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించడంలో ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు యాంటీ అలర్జిక్, యాంటీ ఆక్సిడెంట్ వంటి లక్షణాలు ఈ  ఉల్లిరసం కలిగి ఉంది. అంతేకాదు ప్రతిదినం ఈ రసాన్ని తాగితే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

ఉల్లి గడ్డ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. ఉల్లిరసం వల్ల కూడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలే కల్గుతాయి. ముఖ్యంగా ఈ ఉల్లిరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జిక్, యాంటీ కార్సినోజెనిక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటి వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించవచ్చు. అలాగే చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ గా చేయడంలో ముందుంటుంది. అందుకే ఈ రసాన్ని ఒక నియమం ప్రకారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీనికి కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే. ఈ సమస్య వల్ల నడుమ దగ్గర తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పితో కుదురుగా ఉండలేక విలవిలలాడుతుందారు. అయితే ఈ నొప్పి నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకు ఉల్లిరసం దివ్య ఔషదంలా పనిచేస్తుంది. మార్నింగ్ సమయంలో ఖాళీ కడుపుతో ఈరసాన్ని తాగడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 

చలికాలంలో వచ్చే సర్వ సాధారణమైన సమస్య జలుబు. చలికాలం వస్తే చాలు జలుబు అటాక్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ సమస్య నుంచి తొందరగా బయటపడేందుకు ఉల్లిసరం బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. చలికాలంలో ఎదురయ్యే ఫ్లూ, జలుబు సమస్యతో బాధపడితే ఉల్లిరసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలను తిన్నా ఇవి తొందరగా నయం అవుతాయి. 
 


కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఉల్లిగడ్డ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సమస్యలున్న వారు ప్రతిరోజూ ఉల్లిసరం తో మర్దన చేస్తే రిలీఫ్ ను పొందుతారు. ఆవనూనె కూడా ఈ నొప్పులను దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులను మటుమాయం చేయడంలో ఉల్లి బెస్ట్ మెడిసిన్ అనే చెప్పాలి. 

రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉల్లి ముందుంటుంది. అందులోనూ చాలా మంది ఉల్లిగడ్డను పచ్చిగానే తింటుంటారు. ఇలా తినడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. కాగా ఉల్లిని పచ్చిగానే తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిగడ్డలో ఉండే పోషకవిలువలే ఇమ్యునిటీని పెంచుతాయి. 

click me!